బీచ్ లో ఇసుక దొంగతనం.. టూరిస్టుకు రూ.88 వేలు జరిమానా..
బీచ్ లో ఇసుక దొంగతనానికి పాల్పడిన టూరిస్టుకు భారీగా ఫైన్ వేసిన సంఘటన ఫ్రెంచ్ లో వెలుగులోకి వచ్చింది. సార్డినియాలో ఉండే ప్రసిద్ధ..
బీచ్ లో ఇసుక దొంగతనానికి పాల్పడిన టూరిస్టుకు భారీగా ఫైన్ వేసిన సంఘటన ఇటలీలో వెలుగులోకి వచ్చింది. సార్డినియా బీచ్ లో ఉండే ప్రసిద్ధ తెల్లని ఇసుకను 4 పౌండ్లకు పైగా అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినందుకు ఒక ఫ్రాన్స్ పర్యాటకుడికి 1,200 డాలర్లు.. (రూ.88 వేలు) జరిమానా విధించినట్లు ఇటలీ అధికారులు తెలిపారు.సార్డినియా ఫారెస్ట్ రేంజర్స్ , పర్యాటకుడిని కాగ్లియారి ఎల్మాస్ విమానాశ్రయంలో నిలిపివేసి, అతని వద్ద 4.4 పౌండ్ల ఇసుక ఉన్న బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు.. ఆ తరువాత అతనికి జరిమానా చెల్లించాలని ఆదేశించారు. టూరిస్ట్ దొంగతనం చేసిన ఇసుకను బాటిల్ తో సహా జప్తు చేశామని.. జప్తు వస్తువులను ఆపరేటింగ్ గదిలో ఉంచామని..
ఇసుక దొంగతనం సాధారణంగానే జరుగుతుందని.. సంవత్సరం చివరిలో తమ వద్ద చాలా ఇసుక సీసాలు పేరుకుపోతాయి.. అని ఫారెస్ట్ రేంజర్స్ ప్రతినిధి సిఎన్ఎన్తో చెప్పారు. 2017 లో ప్రవేశపెట్టిన ఒక ప్రాంతీయ చట్టం ప్రకారం సార్డినియా తీరాల నుండి ఇసుక తీసుకోవడాన్ని చట్టవిరుద్ధం చేసింది, తీసుకున్న ఇసుక మొత్తాన్ని బట్టి.. ఎక్కడి నుండి తీసుకోబడింది అనే దానిపై ఆధారపడి $ 600 నుండి $ 3,550 వరకు జరిమానా విధించాలని చట్టంలో పొందుపరిచారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ టూరిస్ట్ ఒకతను ఓ నీళ్ల బాటిల్‌లో దాదాపు రెండు కిలోల ఇసుకను నింపుకొని తీసుకొని వెళుతున్నాడు. అయితే సెప్టెంబర్ 1న కగ్లియరీ ఎల్మాస్ ఎయిర్‌పోర్టులో అతడి దగ్గర ఇసుకను గుర్తించిన అధికారులు.. దాన్ని స్వాధీనం చేసుకొని..1200 డాలర్లు జరిమానా విధించారు.