శిక్షల్లో ఇది ఖతార్నాక్ శిక్ష.. జీవిత ఖైదు, ఉరి కాదు అంతకు మించిన శిక్ష..
శిక్షల్లో ఇది ఖతార్నాక్ శిక్ష జీవిత ఖైదు, ఉరి కాదు అంతకు మించిన శిక్ష అదీ గుండెలు పిండేసిన ఘటనలో ఇంతకీ ఆ శిక్ష ఏంటి ఏ కోర్టు విధించిందో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.
అప్పట్లో గుండెలు పిండేసిన ఘటన. ప్రపంచాన్ని కదిలించిన ఒకే ఒక్క చిత్రం. ఆ దృశ్యం ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించింది. సెప్టెంబరు 2, 2015లో సముద్ర తీరంలో పడివున్న మూడున్నరేళ్ల చిన్నారి అలెన్ కుర్దీ దృశ్యం ప్రపంచం గుండెలను పిండేసింది. ఇది బయటపడిన తర్వాతే శరణార్థుల అంశంపై ప్రపంచ దేశాలు కదిలాయి. శరణార్థుల కోసం పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
అసలేం జరిగింది. శరణార్థుల విషయంలో ప్రపంచదేశాలు ఎందుకు అంతలా స్పందించాయి. దీనికి మానవ అక్రమ రవాణే కారణం.
కుర్దీ కుటుంబాన్ని టర్కీ నుంచి గ్రీకుకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుర్దీ కుటుంబం సహా మరికొందరు చనిపోయారు. 8 మంది కెపాసిటీ కలిగిన ప్లాస్టిక్ బోటులో ఏకంగా 16 మందిని ఎక్కించేశారు. ప్రయాణం మొదలైన కాసేపటికే బోటు సముద్రంలో మునిగిపోయింది. కుర్దీ కుటుంబాన్ని అక్రమంగా తరలించేందుకు దోషులు 6 వేల డాలర్లు వసూలు చేశారు. మొత్తానికి నాలుగున్నరేళ్ల తర్వాత టర్కిష్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మానవ అక్రమ రవాణా కేసులో దోషులు ముగ్గురికి 125 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.