World's Most Expensive Tree: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప.. కిలో ధరతో 10తులాల బంగారం కొనవచ్చు
World's Most Expensive Tree: భూమిపై వేల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిలో చాలా అరుదైన జాతి చెట్లు, మొక్కలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటికి మాత్రం భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ చెట్టు కలప ధర కిలోకు లక్షలలోనే ఉంటుంది. కిలో ధరతో ఏకంగా 10తులాల బంగారాన్నే కొనవచ్చు.
ఈ చెట్టు పేరు ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ (డాల్బెర్జియా మెలనోక్సిలాన్). దాని కలప 1 కిలో ధర 10 వేల డాలర్లు. భారత రూపాయలలో ఇది 855587 రూపాయలు. ఈ ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చాలా అరుదైన చెట్టు జాతి, ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. చెట్టు పూర్తిగా పెరగడానికి దాదాపు 40 నుండి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇది ప్రధానంగా క్లారినెట్స్, ఒబోస్ వంటి ప్రీమియం వుడ్‌విండ్ వాయిద్యాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ చెట్టు కలపను విలాసవంతమైన వస్తువులు, ఫర్నిచర్ తయారీకి కూడా ఉపయోగిస్తారు.చెట్ల నరికివేత బాగా పెరిగిపోయింది. అవి ఇప్పుడు దాదాపు కనుమరుగవుతున్నాయి. అందుకే ఇప్పుడు దాని ధర మరింత పెరిగింది.ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ లాగే, అగర్‌వుడ్ (అక్విలేరియా) అనే మరో విలువైన కలప కూడా ఉంది. ఇది చాలా విలువైన చెట్టు. ఇది సుగంధ రెసిన్ కు ప్రసిద్ధి చెందింది. ఈ కలపను ధూపం, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. ఎబోనీ కూడా ఒక చెట్టు. దీని కలప చాలా విలువైనది. ఇది సంగీత వాయిద్యాలు, అలంకార వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.