Helicopter Crash: న్యూయార్క్ లో ఘోర ప్రమాదం..హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం

Helicopter Crash: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మాన్‌హట్టన్ న్యూజెర్సీ తీరం మధ్య హడ్సన్ నదిలో హెలికాప్టర్ పడిపోవడంతో ఈ పెద్ద ప్రమాదం జరిగింది. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ హెలిపోర్ట్ నుండి బయలుదేరిందని అన్నారు. మధ్యాహ్నం 3:17 గంటలకు హెలికాప్ట్ కూలిపోయినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. మాన్‌హట్టన్, న్యూజెర్సీ తీరం మధ్య హడ్సన్ నదిలో ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు పిల్లలు సహా స్పానిష్ పర్యాటకుల కుటుంబం మరణించిందని అధికారులు తెలిపారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, హెలికాప్టర్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హెలిపోర్ట్ నుండి బయలుదేరిందని చెప్పారు ప్రమాదం తర్వాత మృతదేహాలను నది నుండి బయటకు తీశారు.