Tahawwur Rana: తహవ్వుర్ భారత్ రావడానికి ప్రధాన కారణమైన అమెరికా మహిళా న్యాయమూర్తి ఎవరు?
Tahawwvur Rana: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రానాను ఎట్టకేలకు నేడు భారత్ తీసుకువచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినా తర్వాత పటిష్ట భద్రత నడుమ తీహార్ జైలుకు తరలిస్తున్నారు.
Tahawwur Rana: తహవ్వుర్ భారత్ రావడానికి ప్రధాన కారణమైన అమెరికా మహిళా న్యాయమూర్తి ఎవరు?
Tahawwvur Rana: ముంబై 26/11 ఉగ్రదాడులో సూత్రధారి తహవూర్ రాణా. అయితే ఎప్పటి నుంచో భారత్ అమెరికాను ఈ నరరూప రాక్షసుడిని అప్పగించాలని కోరుతూనే ఉంది ఎట్టకేలకు నేడు ఏప్రిల్ 10 గురువారం భారత్‌కు, యూఎస్ అప్పగించింది. తహవూర్ ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఎన్‌ఐఏ కార్యాలయానికి కట్టుదిట్టమైన భద్రతా నడుమ తరలించారు. విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లో షిఫ్ట్ చేశారు.
మార్క్స్‌మెన్ వాహనాన్ని స్టాండ్ బైగా ఉపయోగించి అత్యంత కట్టుదిట్టంగా తీహార్ జైలుకు తరలించారు. అయితే పాకిస్తాన్ ఇస్లామాబాద్ సైన్యంలో వైద్యుడిగా పనిచేసిన తహవూర్ డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై ఉగ్రదాడులకు పాల్పడ్డారు.
ఇతడికి కెనడా పౌరసత్వం కూడా ఉంది. ఆ తర్వాత చికాగోకి వెళ్లి వీసా ఏజెన్సీ పెట్టగా హెడ్లితో పరిచయం ఏర్పడింది.
అయితే ఈ ఉగ్రవాదిని మన దేశానికి అప్పజెప్పడానికి అమెరికా న్యాయమూర్తి ఎలేనా కగన్ అనే మహిళ న్యాయమూర్తి ద్వారా మార్గం సుగమం అయింది. తహవ్వూర్ పిటిషన్ ఆమె తిరస్కరించారు.
అయితే ఈ కగన్ ఎవరంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అంతేకాదు ఆమె తొలి మహిళా సోలిసిటర్ జనరల్ కూడా. తాను పాకిస్తాన్ ఇస్లామాబాద్ సైన్యంలో పనిచేశానని..అది కూడా ముస్లిం కాబట్టి భారత్ లో తనపై దాడులు జరగవచ్చని, తనను పంపించవద్దని అమెరికా సుప్రీంకోర్టులో వాదించాడు రానా. అయితే కగన్ రానా పిటిషన్ తిరస్కరించారు. దీంతో అతని ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.
ఇండియాకి రాకముందే అత్యంత కట్టుదిట్టంగా భద్రత పెంచారు. అమిత్ షా, జైశంకర్,అజిత్ దోవల్ సమావేశం నిర్వహించి అతని భారత్ రప్పించారు. ఇక రాణాకు వ్యతిరేకంగా ఎన్‌ఐఏ పబ్లిక్ ప్రొసిక్యూటర్‌గా మహేంద్రను నియమించి గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఒక కొత్త నాటకానికి తెర తీసింది. తహవూర్ రాణా కెనడా పౌరసత్వం ఉంది. తమ పౌరుడు కాదని బుకాయిస్తోంది. పాక్ అడ్డాగా లష్కర్ ఏ తాయిబా ముంబై ఉగ్రదాడులకు తెగబడిన సంగతి అందరికీ తెలిసిందే అయినా కానీ పాకిస్తాన్ ఇలా బుకాయిస్తోంది. ఇక రాణాను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని భారత్ భావిస్తోంది.