Bullet Train: భారత్ కు జపాన్ బంపరాఫర్..3 గంటల్లో ..508 కి.మీ వేగంతో నడిచే బుల్లెట్ రైళ్లు

Bullet Train: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం జపాన్ భారతదేశానికి రెండు షింకన్సేన్ రైళ్లను (E5, E3 మోడల్స్) ఉచితంగా ఇవ్వబోతోంది. రైళ్ల డెలివరీ 2026 ప్రారంభంలో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ బుల్లెట్ రైలు కారిడార్ 508 కి.మీ పొడవు ఉంది. అందులో 360 కి.మీ అంటే దాదాపు 71శాతం పనులు పూర్తయ్యాయి. ఆగస్టు 2027 నాటికి కొంత భాగాన్ని ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. దీనికి ముందు, ఈ రైళ్లను భారతదేశంలోని వేడి వాతావరణం , దుమ్ముతో కూడిన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా నడిపిస్తారు. దీని ద్వారా, అవసరమైన సాంకేతిక సమాచారాన్ని సేకరించి, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రైలును ఎలా మెరుగుపరచవచ్చనే దానిపై పని జరుగుతుంది.
జపాన్ ప్రస్తుతం E10 అనే కొత్త మోడల్ బుల్లెట్ ట్రైన్ పై పని చేస్తోంది. ఇది E3, E5 కంటే వేగంగా ఆధునికంగా ఉంటుంది. దీనికి సంబంధించి జపాన్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. భారతదేశం, జపాన్ రెండింటిలోనూ ఒకేసారి E10 ను ట్రాక్‌పైకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే ఇది సిద్ధం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి, ప్రస్తుతానికి, E3, E5 రైళ్లను ఉపయోగిస్తారు. ఈ రైళ్ల నుండి పొందిన అనుభవం E10 ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. E10 రైలులో ఎక్కువ లగేజీని నిల్వ చేయగలిగే విధంగా రూపొందించారు. ఇది మాత్రమే కాదు ఈ బల్లెట్ రైలు ఎలాంటి వాతావరణ పరిస్థితులను అయినా తట్టుకోగలదు.
దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై, అహ్మదాబాద్ మధ్య నడుస్తుంది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన సెప్టెంబర్ 14, 2017న జరిగింది. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే ప్రారంభించారు. ఈ బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం మూడు గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఇది ప్రయాణీకుల సమయం, ప్రయాణం రెండింటినీ సులభతరం చేస్తుంది. ప్రస్తుతం, దురంతో ద్వారా ఈ దూరాన్ని అధిగమించడానికి ఐదున్నర గంటలు పడుతుంది. అయితే, సాధారణ రైలులో దాదాపు ఏడు నుండి ఎనిమిది గంటలు పడుతుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.08 లక్షల కోట్లు.