TIME మ్యాగజైన్‌ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపులో ట్రంప్‌, మస్క.. మరి ఇండియన్స్‌ సంగతేంటి?

TIME 2025 100 ప్రభావశీలుల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప వ్యక్తులు నిలిచారు. మరి ఈసారి భారత్‌కు చెందిన ఎవరైనా ఉన్నారా?

Update: 2025-04-17 13:15 GMT
TIME మ్యాగజైన్‌ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపులో ట్రంప్‌, మస్క.. మరి ఇండియన్స్‌ సంగతేంటి?

100 days of government: 100రోజుల పాలన పూర్తి చేసుకున్న ట్రంప్ సర్కార్..10 సంచలన నిర్ణయాలతో ప్రపంచంలో అల్లకల్లోలం

  • whatsapp icon

ప్రపంచంలో గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తుల పేర్లతో రూపొందించే TIME మ్యాగజైన్‌ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2025 జాబితా తాజాగా వెలువడింది. ఈసారి కూడా రాజకీయ నాయకులు, కళాకారులు, టెక్ మేధావులు, మ్యూజిక్ ఐకాన్లు, స్పోర్ట్స్ లెజెండ్స్ ఇలా అనేక రంగాల నుంచి ప్రముఖులు ఈ లిస్టులో చోటు సంపాదించారు. అయితే ఈసారి ఈ ప్రెస్టీజియస్ లిస్టులో భారతీయులకు చోటు దక్కలేదు.

ఈసారి లీడర్స్ కేటగిరీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మల్టిబిలియనీర్ ఎలాన్ మస్క్‌, యూకే ప్రధాని కియర్ స్టార్మర్‌, బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మొహమ్మద్ యునుస్‌, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్నారు. అలాగే మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బామ్ పార్డో కూడా ఇందులో చేరారు. ఇక ఎంటర్టైన్‌మెంట్ ప్రపంచం నుంచి ఎడ్ షీరన్, సెరీనా విలియమ్స్, డెమీ మూర్, స్కార్లెట్ జోహాన్సన్, బ్లేక్ లైవ్లీ, ఆడ్రియన్ బ్రాడీ, హోజియర్, యోషికి వంటి పేర్లు TIME జాబితాలో కనిపించాయి.

ఇండియన్స్ విందామా అనుకుంటే, ఈసారి జాతీయస్థాయిలో భారతీయులకు అవకాశమే రాలేదు. అయితే లీడర్స్ విభాగంలో ముంబయిలో పుట్టిన రేష్మా కేవల్రామణి పేరు ఉంది. ఆమె అమెరికాలోని వెర్టెక్స్‌ ఫార్మాసూటికల్స్‌ అనే బహుళజాతీయ బయోటెక్ కంపెనీకి CEO. ఇది ఒక పెద్ద పబ్లిక్ లిస్టెడ్ సంస్థగా గుర్తింపు పొందింది. ఆమె 11ఏళ్ల వయసులో ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. 2024లో మాత్రం అలియా భట్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌లు లిస్టులో చోటు సంపాదించినవారు. కానీ ఈసారి దేశం నుంచి ఎవరూ TIME 100 లిస్టులో లేరు అన్నది కొంత నిరాశకరమైన విషయం.

Tags:    

Similar News