Russia-Ukraine: శవాలు మూటలుగా మారి రోడ్లపై కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలు.. కన్నీళ్లు ఆగవు!

Russia-Ukraine: మానవతం అనే పదానికి అర్థం మరిచిపోయిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది.

Update: 2025-04-14 12:49 GMT
Russia-Ukraine

Russia-Ukraine: శవాలు మూటలుగా మారి రోడ్లపై కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలు.. కన్నీళ్లు ఆగవు!

  • whatsapp icon

Russia-Ukraine: మానవతం అనే పదానికి అర్థం మరిచిపోయిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచమంతా తమకేమీ పట్టనట్టు చూస్తున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా తన పోరును తీవ్రతరం చేసింది. రోజువారీ బాంబుల మధ్య భయపడి దాక్కున్న పిల్లల అరుపులు గాలిలో కలిసిపోయాయి. ప్రార్థణా స్థలాలు ధ్వంసమయ్యాయి. హాస్పిటల్స్ స్మశానాల్లా మారాయి. పసి బిడ్డల శవాలు మూటలుగా మారి రోడ్లపై కనిపిస్తున్నాయి. ఈ భీకర దాడిని చూస్తూ ఆవేదన చెందిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్రంప్‌కు ఒక విజ్ఞప్తి చేశారు.

'మిస్టర్‌ ట్రంప్‌.. ఈ ధ్వంసాన్ని మీ కళ్ళతో చూడండి.. ప్రార్థన స్థలాలు, ఆస్పత్రులపై పడిన బాంబులను చూడకుండా మాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు.. ముందు ఉక్రెయిన్‌కు రండి' అంటూ జెలెన్‌స్కీ చెప్పిన మాటల్లో బాధ ఎంతో బాధ దాగుంది.

నిన్నమొన్నటివరకు యుద్ధ బీభత్సం కాస్త ఆగినట్టు కనిపించిన యుక్రెయిన్‌ గడ్డపై మళ్లీ నెత్తురు పారుతోంది. ఏప్రిల్ ఆరంభం నుంచి యుద్ధం మరింత భయానక రూపం దాల్చింది. పామ్‌ సండే పర్వదినాన్ని జరుపుకుంటున్న సమయంలో సుమి నగరంపై రష్యా మిస్లైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో 34 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రోడ్లపై నల్లటి శవబ్యాగులు కనిపిస్తున్నాయి. తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి, తండ్రి ఒడిలో ఎర్రని కళ్ళతో బిగబట్టిపట్టుకుని ఏడుస్తూ నిలబడి ఉన్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. కొంతమంది శరీరాలు మంటల్లో కాలిపోయి, గుర్తుపట్టలేని స్థితికి చేరాయి.

Tags:    

Similar News