Pope Francis Passes away: పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు... ఆయన చివరి సందేశం ఏంటంటే...

Pope Francis died: పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు... ఆయన చివరి సందేశం ఏంటంటే...
Pope Francis passes away: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథోలిక్ క్రిస్టియన్స్ దైవంగా భావించే వారి మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. క్రిస్టియన్స్‌కు ఎంతో ప్రత్యేకమైన ఈస్టర్ వేడుకలు జరుగుతున్న తరుణంలోనే ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. పోప్ ఫ్రాన్సిస్ గత కొంత కాలంగా న్యూమోనియా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈస్టర్ సోమవారం ఉదయం 7.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 88 ఏళ్లు.
పోప్ ఫ్రాన్సిస్ మృతిని నిర్ధారిస్తూ వాటికన్ సిటీ చర్చ్ పెద్దలు కెవిన్ ఫారెల్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితం మొత్తాన్ని ఆ ప్రభువు సేవలోనే గడిపేశారని ఫారెల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈస్టర్ వేడుకల సందర్భంగా వాటికన్ సిటీలోని చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ తరపున చర్చి పెద్దలు ఆయన సందేశాన్ని చదివి వినిపించారు. సాధారణంగా పోప్ ఫ్రాన్సిస్ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. కానీ ఆయన మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో చర్చ్ పెద్దలే ఆ సందేశాన్ని చదివి వినిపించారు.
ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం వల్ల ఇజ్రాయెల్, పాలస్తినా, లెబనాన్ ప్రజలు యుద్ధం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మూడు దేశాల్లోని క్రిస్టియన్స్ రక్షణ గురించి ఆందోళన చెందుతున్నట్లు పోప్ తెలిపారు. ఇదే ఆయన చివరి సందేశం అవుతుందని అనుకోలేదు.
పోప్ ఫ్రాన్సిస్ చివరి సందేశం వీడియో
BREAKING: Pope Francis has died at the age of 88, the Vatican has announced.https://t.co/d40fgMNYxi
— Sky News (@SkyNews) April 21, 2025
📺 Sky 501 and YouTube pic.twitter.com/F1BHUy7CUM
ఫ్రాన్సిస్ పోప్ గా 2013 మార్చి 13న బాధ్యతలు చేపట్టారు. వాటికన్ సిటీ క్యాథోలిక్ చర్చ్ పోప్ గా ఫ్రాన్సిస్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ మృతితో ఆయన తరువాత ఆ స్థానంలో కూర్చునేది ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ జాబితాలో 8 మంది ముందు వరుసలో ఉన్నారు.