Zelensky: ఉక్రెయిన్‎లో ఏం జరుగుతుందో వచ్చి కళ్లారా చూడండి.. అమెరికా అధ్యక్షుడికి జెలెన్ స్కీ ఆహ్వానం

Update: 2025-04-14 04:46 GMT
Zelensky: ఉక్రెయిన్‎లో ఏం జరుగుతుందో  వచ్చి కళ్లారా చూడండి.. అమెరికా అధ్యక్షుడికి జెలెన్ స్కీ ఆహ్వానం
  • whatsapp icon

Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. ఆదివారం సుమీ నగరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం వల్ల 34 మంది మరణించారు. 117 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు. రష్యా దాడి వల్ల జరిగిన వినాశనాన్ని కళ్లారా చూడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. ఈ పర్యటనతో అయినా పుతిన్ చేస్తున్న విధ్వంసాన్ని ఆయన అర్థం చేసుకుని ఎలాంటి వారితో ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుంటారని తెలిపారు.

యుద్ధాన్ని ముగించాలని పుతిన్ ఎప్పుడూ కోరుకోలేదు..మా దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాపై దాడులు చేస్తోంది. నేను పుతిన్ ను నమ్మనని చాలా సార్లు అమెరికా అధినేతతో చెప్పాను. రష్యా మారణహోమంలో అనేక మంది మరణిస్తున్నారు. దయచేసి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు చర్యలు చేపట్టేముందు వారిని చూడటానికి రండి..దాడులు జరుగుతున్న ఏ నగరంలో అయినా మీరు పర్యటించవచ్చని జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags:    

Similar News