Russia: రష్యాపై ట్రంప్‌ అనుమానం.. పుతిన్ నిజంగా యుద్ధం ఆపాలనుకుంటున్నారా?

Russia: ఒకవైపు రష్యా చర్చలకు సిద్ధమని ప్రకటించగా, మరోవైపు అమెరికా నుంచి ఆ సందేహాలు వ్యక్తమవుతూ యుద్ధం ముగియాలనే ఆకాంక్ష అంతర్జాతీయంగా మళ్లీ వెలుగు చూసింది.

Update: 2025-04-27 01:30 GMT
Russia

Russia: రష్యాపై ట్రంప్‌ అనుమానం.. పుతిన్ నిజంగా యుద్ధం ఆపాలనుకుంటున్నారా?

  • whatsapp icon

Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి సంబంధించి కీలక వ్యాఖ్య చేశారు. మాస్కో, కీవ్ మధ్య శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అదీ ఎలాంటి షరతులూ లేకుండా చర్చలకు వచ్చే సిద్ధం ఉన్నామని క్రెమ్లిన్ ప్రకటించింది. శుక్రవారం అమెరికా దౌత్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ప్రకారం, పుతిన్ ఇప్పటికే పలు సందర్భాల్లో తాము చర్చలకు సిద్ధమేనని పునరుద్ఘాటించారని చెప్పారు. అయితే ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పుతిన్‌పై సందేహం వ్యక్తం చేశారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పబ్లిష్ చేసిన పోస్టులో, ఇటీవల పుతిన్ పౌర ప్రాంతాలపై దాడులు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పుతిన్ నిజంగా యుద్ధం ఆపాలనుకుంటున్నాడా లేదా అనేది తనకు సందేహంగా ఉందని అన్నారు. పుతిన్ తాను చర్చలకు సిద్ధమని నటిస్తున్నాడేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఇదంతా వేటికంటే ముందు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో జరిగింది. పాప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ట్రంప్, జెలెన్స్కీ ఓ ప్రైవేట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని వైట్‌హౌస్ 'ఉత్పాదకమైన భేటీ'గా అభివర్ణించింది. జెలెన్స్కీ సమావేశం తర్వాత సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇద్దరూ ఒకే ఉద్దేశంతో చర్చించామని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, పూర్తి కాల్పుల విరమణ కోసం కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇది చరిత్రాత్మకంగా నిలిచే అవకాశం ఉన్న సమావేశమని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.

ఇక పుతిన్ పాప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యుద్ధ నేరాల ఆరోపణలపై అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మాస్కో ఉక్రెయిన్ పై చేసిన దాడులతో సంబంధించి పుతిన్ పై ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకవైపు రష్యా చర్చలకు సిద్ధమని ప్రకటించగా, మరోవైపు అమెరికా నుంచి ఆ సందేహాలు వ్యక్తమవుతూ యుద్ధం ముగియాలనే ఆకాంక్ష అంతర్జాతీయంగా మళ్లీ వెలుగు చూసింది.

Tags:    

Similar News