Pak minister: 130 అణ్యాయుధాలను భారత్‌వైపు పెట్టాం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Pak minister: ఆసిఫ్ ఇంకా భారత్ పహల్గాం దాడిని 'ప్రేమ్ ప్లాన్'గా స్టేజ్ చేసినట్టుగా ఆరోపిస్తూ, తమ దేశానికి నింద నెట్టేందుకు ప్రయత్నించిందని విమర్శించాడు.

Pak minister: 130 అణ్యాయుధాలను భారత్‌వైపు పెట్టాం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Pak minister: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన వేళ, పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా భారత్‌ను అణు యుద్ధంతో బెదిరించాడు. తన దేశం కలిగి ఉన్న గోరీ, షాహీన్, గజ్నవీ మిసైళ్లు, 130 అణ్వాయుధాలన్నీ భారత్‌ను లక్ష్యంగా ఉంచినవే అని అతను ప్రకటించాడు.
భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్‌కు నీటిని నిలిపివేస్తే, అది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించాడు. పాకిస్తాన్‌కు ఉన్న అణు ఆయుధాలు ప్రదర్శన కోసమే కాదు, అవి దేశం మొత్తం వ్యాప్తంగా గుట్టుగా దాచినట్టు చెప్పాడు. ఇండియా, పాకిస్తాన్ సంబంధాలు పహల్గాం దాడి తర్వాత మరింత చెడిపోయాయి. భారత్ పాకిస్తాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా, అన్ని పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ విమాన సర్వీసులు తమ గగనతలాన్ని భారత్ విమానాలకు మూసివేయడంతో భారత విమానయాన రంగానికి భారీ ఇబ్బందులు తలెత్తాయని అబ్బాసీ చెప్పారు. పదిరోజులు గడిచినా ఈ పరిస్థితి కొనసాగితే భారతీయ ఎయిర్లైన్స్‌లు మూతపడతాయని ధ్వజమెత్తాడు. పహల్గాం దాడిపై భారత్ మదింపులు తప్పు అని, తమ భద్రతా విఫలమైందని అబ్బాసీ ఆరోపించాడు. భారత్ తమ దేశంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డాడు. అంతేకాదు, భారత్ తీసుకున్న వ్యాపార సంబంధాల తెరువుపై కూడా పాకిస్తాన్ ఇప్పటికే ప్రతిస్పందనకు సిద్ధమైందని ప్రకటించాడు.
దీనికితోడు, పాకిస్తాన్ రక్షణమంత్రి ఖాజా ఆసిఫ్ ఇటీవల చేసిన ప్రకటనలు మరింత సంచలనం సృష్టించాయి. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చిందని, దీని వల్ల తమ దేశానికే నష్టం జరిగిందని ఆసిఫ్ అంగీకరించాడు. అయితే దీనికి అమెరికా, పశ్చిమ దేశాలే కారణమని, తాము తప్పు చేయలేదని ఆరోపించాడు. ఆసిఫ్ ఇంకా భారత్ పహల్గాం దాడిని 'ప్రేమ్ ప్లాన్'గా స్టేజ్ చేసినట్టుగా ఆరోపిస్తూ, తమ దేశానికి నింద నెట్టేందుకు ప్రయత్నించిందని విమర్శించాడు. లష్కరే తోయిబా వంటి సంస్థలు ఇప్పుడు లేవని, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి తనకు ఎప్పుడూ వినిపించలేదని కూడా చెప్పాడు.