China-America: ఏం చేసినా వెనక్కి తగ్గం.. ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న కమ్యూనిస్టు చైనా!

China-America: ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లపై ఎంత మేరకు ప్రభావం చూపనున్నాయన్నది వేచిచూడాల్సిన అంశమే.

Update: 2025-04-10 14:13 GMT
China-America

China-America: ఏం చేసినా వెనక్కి తగ్గం.. ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న కమ్యూనిస్టు చైనా!

  • whatsapp icon

China-America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయాల నేపథ్యంలో, చైనా మరోసారి స్పష్టంగా తన వైఖరిని ప్రకటించింది. అమెరికా 125 శాతం సుంకాలు విధించడంపై బీజింగ్‌ స్పందిస్తూ తమకు ఘర్షణ అనవసరమని, కానీ ఒత్తిడులకు లొంగే ప్రసక్తే లేదని తెలిపింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హే యోంగ్‌కియాన్ ప్రకారం, చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని కానీ అవి పరస్పర గౌరవం, సమానత్వం పైనే ఆధారపడాలని స్పష్టం చేసింది.

అత్యధికంగా ప్రభావితమైన దేశంగా చైనా ఈ పరిస్థితిని నేరుగా ఎదుర్కొంటున్నప్పటికీ, ఒత్తిడి, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ విధానాలకు తాము తలవంచబోమని చైనా స్పష్టం చేసింది. వాణిజ్య యుద్ధంలో గెలుపొందేవారు లేరన్న అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ, అమెరికా తమ ధోరణిని మార్చకపోతే తాము చివరి వరకు పోరాడతామని హెచ్చరించింది. ట్రంప్ ఇటీవల ప్రకటించిన తాజా చర్యల్లో భాగంగా, ప్రపంచంలోని చాలా దేశాలకు 90 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చినప్పటికీ, చైనాకు మాత్రం ఆ మినహాయింపు దక్కలేదు.

మరోవైపు ట్రంప్ తన వైఖరిలో యూటర్న్ తీసుకోలేదని, ప్రతీకార చర్యలు తీసుకోనివారికి మాత్రమే తాత్కాలిక మినహాయింపులు ఇచ్చినట్టు చెప్పారు. ఇక ఇతర దేశాలతో కలిసి అమెరికా ధోరణికి ఎదురుగానిలిచేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇప్పటికే యూరోప్ యూనియన్‌, మలేషియాతో చర్చలు జరిపినట్లు చైనా తెలిపింది. అయితే, ఆస్ట్రేలియా మాత్రం ఈ ప్రయత్నాలను నిరాకరించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో ఈ తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, చైనా ప్రపంచ వాణిజ్యం పట్ల ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. అయితే ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లపై ఎంత మేరకు ప్రభావం చూపనున్నాయన్నది వేచిచూడాల్సిన అంశమే.

Tags:    

Similar News