China: అమెరికా వెళ్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. తమ టూరిస్టులకు చైనా హెచ్చరిక

Update: 2025-04-10 01:24 GMT
China: అమెరికా వెళ్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. తమ టూరిస్టులకు చైనా హెచ్చరిక
  • whatsapp icon

China: అమెరికా చైనా మధ్య వాణిజ్యం యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లే తమ దేశ పర్యాటకులకు డ్రాగన్ కంట్రీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని..జాగ్రత్త అంటూ చైనా టూరిజం శాఖ సూచించింది. దీంతోపాటు అమెరికా రాష్ట్రాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఆయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకోవాలని కోరింది.

చైనా అమెరికా వాణిజ్య సంబంధాలు క్షీణించడంతోపాటు అమెరికాలో భద్రతా పరిస్థితుల కారణంగా అమెరికా ప్రయాణించే ముందు అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందస్తుగా అంచనా వేసుకుని వెళ్లాలని టూరిస్టులకు సూచిస్తున్నాం అని చైనా పర్యటక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే చైనీయుల కోసం విద్యాశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

కొన్ని రాష్ట్రాల్లో చైనీయులకు సంబంధించి ప్రతికూల నిబంధనలు ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో అక్కడ చదువాలనుకునే వారు స్థానికంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవాలని వారికి సూచించింది.

Tags:    

Similar News