Tahawwur Rana's Extradition: తహవ్వూర్ రాణా అరెస్ట్‌పై స్పందించిన పాక్

Update: 2025-04-10 16:32 GMT

Tahawwur Rana's Extradition: తహవ్వూర్ రాణా అరెస్ట్‌పై స్పందించిన పాక్

Tahawwur Rana's Extradition: భారత ప్రభుత్వం తహవ్వూర్ రాణాను అమెరికాలో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించంపై పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. రానా పాకిస్థానీ కెనెడియన్ టెర్రరిస్ట్ అనే విషయం తెలిసిందే. 2008 నాటి 26/11 ముంబై ఉగ్రదాడులకు కుట్రపన్నిన రాణాను తమను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం ఎప్పటి నుండో అమెరికాను కోరుతోంది.

ఎట్టకేలకు భారత దౌత్యం ఫలించడంతో అమెరికా సర్కారు రాణాను భారత్ కు అప్పగించింది. రాణాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అవడంతోనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్‌లో రాణాను ప్రశ్నించిన అనంతరం అతడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.

రాణాను భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి విచారణ చేస్తుండటంపై తాజాగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్ అలీ ఖాన్ స్పందిస్తూ అతడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాణా గత రెండు దశాబ్ధాలుగా కెనడాలో ఉంటున్నాడు. రెండు దశాబ్ధాల క్రితమే పాకిస్థాన్ పౌరసత్వం కోల్పోయిన రాణా ఇప్పటివరకు పాక్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు. అందుకే ఇప్పుడు అతడు పాకిస్తాన్ దేశస్తుడు కాబోడు అని ఖాన్ అభిప్రాయపడ్డారు.   

రాణా ఉగ్రవాది ఎలా అయ్యాడు?

తహవ్వూర్ రాణా 1961, జనవరి 12న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని చిచావట్నిలో పుట్టాడు.

వృత్తిరీత్యా డాక్టర్ అయిన రాణా పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ విభాగంలో కెప్టెన్ జనరల్ డ్యూటీ ప్రాక్టీషనర్ గా పనిచేశాడు.

రాణా భార్య కూడా డాక్టర్. భార్యాభర్తలు ఇద్దరూ 1997 లో కెనడాకు మకాం మార్చారు. 2001 లో కెనడా పౌరసత్వం వచ్చింది.

కెనడా, అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సేవల బిజినెస్ పేరుతో ఆఫీసులు తెరిచాడు.

డేవిడ్ హెడ్లీ కోల్మన్, రాణా ఇద్దరూ కలిసి పాకిస్తాన్ లో లష్కర్ నిర్వహించిన ట్రైనింగ్ క్యాంపులకు హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో పని చేసిన అనుభవాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఉపయోగించాడు. అలా ముంబై దాడులలో లష్కర్ ఉగ్రవాదులకు తోడ్పడ్డాడు  

Tags:    

Similar News