USA EGGS RATES: అమెరికాలో డజను కోడిగుడ్ల ధర తెలిస్తే గుండె గుభేల్ మంటుంది

Update: 2025-04-11 02:36 GMT
USA EGGS RATES: అమెరికాలో డజను కోడిగుడ్ల ధర తెలిస్తే గుండె గుభేల్ మంటుంది
  • whatsapp icon

USA EGGS RATES: తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధర ఎంత..5 లేదా 6 రూపాయల మధ్యే ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఒక్క గుడ్డు ధర ఏకంగా 44 రూపాయలకు పెరిగింది. అమెరికాలో డజను గుడ్ల ధర 6.23 డాలర్లకు చేరుకుంది. అంటే భారత కరెన్సీలో రూ. 536. మార్చి నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీలో గుడ్ల ధరను అమెరికా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. గుడ్ల కొరత అంశం మరోసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది.

గత కొన్నాళ్లుగా అమెరికాలో బర్డ్ ఫ్లూ విజ్రుంభిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాధి వ్యాప్తి కట్టడే లక్ష్యంగా కోట్లాది కోళ్లను వధించారు. దీంతో గుడ్ల కొరత విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లే డజను గుడ్ల ధర కొండెక్కి కూర్చొంది. ఫిబ్రవరిలో ఒక దశలో డజను గుడ్ల ధర ఏకంగా 7.34 డాలర్లకు పెరిగి మళ్లీ దిగివచ్చింది. ఇప్పుడది మళ్లీ 6 డాలర్లను దాటింది. ఈస్టర్ పండగ సందర్భంగా గుడ్లకు భారీగా గిరాకీ పెరిగింది.

కాగా ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ వరకు ధరల ఉరవడి ఆగకపోవచ్చని తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయాలతో జనవరి, ఫిబ్రవరిలో ఏకంగా 3 కోట్లకుపైగా గుడ్లుపెట్టే కోళ్లను వధించారు. దీంతో ఈ సమస్య మరింత పెరిగింది. కోళ్ల ఫారాలను పూర్తిగా శానిటైజ్ చేసి కొత్త కోళ్లను సాగుతున్నారు. దీంతో కొత్త కోళ్లతో గుడ్ల దిగుబడి పెరిగితే ధరలు కిందకు దిగివచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News