ఈ దేశంలో అందరు పొట్టివారే..! ఎందుకో తెలుసా..?

East Timor: ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటాయి.

Update: 2021-11-23 14:00 GMT

ఈ దేశంలో అందరు పొట్టివారే..! ఎందుకో తెలుసా..?(ఫైల్ ఇమేజ్)

East Timor: ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో సంప్రదాయం, ఆచార వ్యవహారాలు ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా తేడాగా ఉంటారు. కొందరు పొట్టిగా ఉంటే మరికొందరు పొడుగ్గా ఉంటారు. ముఖ కవలికల్లో కూడా తేడాలు ఉంటాయి. అయితే వారి దేశ జీవన పరిస్థితుల ఆధారంగా వారు ఆ విధంగా ఉంటారు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమిలేదు. అయితే ప్రపంచంలోని ఒక దేశంలో ప్రజలందరు పొట్టిగా ఉంటారు. ఆ వింత దేశం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం.

ఆగ్నేయాసియా దేశం తూర్పు తైమూర్ దేశంలో నివసించే ప్రజల సగటు ఎత్తు 5 అడుగులు మాత్రమే. అయితే ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి నేపాల్కు చెందినవాడు అతి పొట్టి మహిళ భారతదేశం అయినప్పటికీ తూర్పు తైమూర్ ప్రపంచంలోనే అత్యంత పొట్టి ప్రజలు నివసించే ప్రత్యేక దేశం. ఇక్కడ పురుషులు, స్త్రీలు అందరు పొట్టిగానే ఉంటారు. ఒక ఆంగ్ల వెబ్సైట్ నివేదిక ప్రకారం ఇక్కడ నివసిస్తున్న పురుషుల సగటు పొడవు 159.79 సెంటీమీటర్లు కాగా, మహిళల సగటు పొడవు 151.15 సెంటీమీటర్లు. ఇక్కడి వ్యక్తులు ఎత్తు తక్కువగా ఉండటానికి కారణం జన్యులోపమే.

1896 సంవత్సరంతో పోలిస్తే తూర్పు తైమూర్ ప్రజల ఎత్తులో పెరుగుదల ఉంది. ఈ సమయంలో ఇక్కడి ప్రజల ఎత్తు 5 అడుగులు ఉండగా 1960 సంవత్సరం నాటికి సగటు ఎత్తు 5.3 అడుగులకు పెరిగి 1970 తర్వాత మళ్లీ ఎత్తు తగ్గడం మొదలైంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వ్యక్తులు నెదర్లాండ్స్ పౌరులు. ఇక్కడి ప్రజల సగటు పొడవు 6 అడుగులుగా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం భారతదేశంలో పురుషుల సగటు ఎత్తు 5.8 అడుగులు కాగా, స్త్రీల ఎత్తు 5.3 అడుగులు.

Tags:    

Similar News