Telegram CEO Arrest: టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్
Telegram CEO Arrest: టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్టు అయ్యారు. ఫ్రాన్స్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ జెట్ ద్వారా దేశంలో ల్యాండ్ అయిన వెంటనే పావెల్ ను అరెస్టు చేశారు పోలీసులు.
Telegram CEO Arrest: టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈవో పావెల్ దురోవ్ ఫ్రాన్స్‌లో అరెస్టయ్యారు. ఈ సమాచారాన్ని TF One TV షేర్ చేసింది. సమాచారం ప్రకారం, టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్,వ్యవస్థాపకుడు, CEO అయిన పావెల్ దురోవ్‌ను శనివారం సాయంత్రం పారిస్ వెలుపల ఉన్న బౌర్గెట్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. TF One ప్రకారం, దురోవ్ తన ప్రైవేట్ జెట్ ద్వారా దేశంలోనే ల్యాండ్ అయిన వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు. అయితే ఈ విషయంపై టెలిగ్రామ్ ఇంకా స్పందించలేదు.
ఎందుకు అరెస్ట్ చేశారు?
39 ఏండ్ల టెలిగ్రామ్ సీఈవో, బిలియనీర్ పావెల్ దువోర్ అరెస్టుకు అసలు కారణంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ టెలిగ్రామ్ యాప్ నుకు సంబంధించి అఫెన్స్ లు వారెంట్ తో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్ యాప్ లో మాడరేటర్లు లేకపోవడంతో నేర కార్యకలాపాలను నియంత్రించడం కష్టంగా మారతుందని..ఇదే విషయంపై పోలీసులు గత కొంత కాలంగా దర్యాప్తు చేస్తున్నారని..ఇందులో భాగంగానే టెలిగ్రామ్ సీఈఓను తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిని అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
అయితే ఈ అరెస్టు వార్తలపై ఇప్పటి వరకు టెలిగ్రామ్ యూనిట్ స్పందించలేదు. ప్రాన్స్ ప్రభుత్వం కూడా ఎలా వ్యాఖ్యలు చేయలేదు. పావెల్ అరెస్టుపై ఫ్రాన్స్ లోని రష్యా ఎంబసి మాత్రం స్పందించింది. పరిస్థితులపై అవగాహన, క్లారిటీ తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. టెలిగ్రామ్ సిబ్బందితో ఇంకా మాట్లాడలేదని వెల్లడించింది. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది పావెల్ దురోవ్ కు సపోర్టుగా ట్వీట్స్ చేస్తున్నారు. నిజాన్ని సెన్సార్ చేయడం లేదన్న కారణంతోనే అరెస్టు చేశారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రపంచంలోనే దిగ్గజ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో టెలిగ్రామ్ కూడా ఒకటి. ఫేస్ బుక్,వాట్సాప్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, టెక్ టాక్ , స్నాప్ చాలతో పోటీగా టెలిగ్రామ్ కు చాలా దేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. కాగా టెలిగ్రామ్ 2013లో రష్యాలో పావెల్ స్థాపించారు.