మహిళ కడుపులోనుంచి నాలుగు అడుగుల పామును బయటకు తీసిన వైద్యులు (వీడియో)
రష్యాలోని డాగేస్టాన్‌లో ఒక మహిళ నోటి నుండి నాలుగు అడుగుల పొడవున్న పామును వైద్యులు..
రష్యాలోని డాగేస్టాన్‌లో ఒక మహిళ నోటి నుండి నాలుగు అడుగుల పొడవున్న పామును వైద్యులు సేకరించారు. కడుపు నొప్పి కారణంగా ఆ మహిళ సోమవారం ఆసుపత్రిలో చేరింది. అయితే మొదట ఆ మహిళకు ఏమైందనే విషయాన్నీ కనుక్కోలేకపోయారు. అయితే వైద్య పరీక్షల తర్వాత, ఆమె కడుపులో ఏదో ఉందని కనుగొన్నారు. దాంతో ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి నోటిలోకి పైపును పంపించారు.. ఈ క్రమంలో ఆమె నోటిగుండా నాలుగు అడుగుల పొడవున్న పామును బయటకు తీశారు. మహిళ నోటి నుండి పామును తొలగించే మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
వీడియోలో, వైద్యులు మహిళ నోటి నుండి పామును తీయడం కనిపిస్తుంది. కడుపు నుండి పామును బయటకు తీయగానే, చికిత్స పొందుతున్న సదరు మహిళ, భయాందోళనకు గురైంది.. అయితే ఆ మహిళకు ధైర్యం చెప్పిన వైద్యులు.. పామును బకెట్లో ఉంచారు. ఇదిలావుంటే ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న తోటలో నిద్రిస్తున్నప్పుడు నోరు తెరిచి ఉండటం వలన పాము నోటిలోనుంచి కడుపులోకి వెళ్ళింది. ఉదయం మేల్కొన్నప్పుడు, కడుపు నొప్పిగా భావించి వైద్యుల వద్దకు వెళ్లగా వారు ఆ పామును తొలగించారు. అయితే ఆ పాము కడుపు లో నుండి తీసిన తరువాత సజీవంగా ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు.
Medics pull out 4 feet Snake from a woman's throat after the animal crawled into her mouth while she slept.
— BBNaija and other updates (@ngoziclara) August 31, 2020
The incident happened in Russia.#LayconNeedsYou II #BiggieForgiveErica II Adele II #BBTolanibaj pic.twitter.com/kN5bisWrcA