Gunfire in Kamala Harris' campaign office: అమెరికాలో కాల్పుల కలకలం..కమలా హారిస్ ఆఫీస్‎పై కాల్పులు

Kamala Harris office shot: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి కార్యాలయంపై తొపాకులతో ఫైరింగ్ కు పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

Update: 2024-09-25 04:04 GMT

అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాల్పులు ఘటన మరువకముందే ఇప్పుడు మరోసారి కాల్పులు జరిగాయి. ఈసారి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి. అర్థరాత్రి సమయంలో పార్టీ కార్యాలయంపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. అయితే ఆ సమయంలో పార్టీ ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై దాడులు జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి కార్యాలయం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆఫీసు కిటీకిల నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఇటీవలే మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కూడా కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ అడుతుండగా నిందితుడు హత్యయత్నానికి ప్రయత్నించాడు. ఫెన్సింగ్ దగ్గర నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించిన సెక్యూరిటీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవి గాయం అయ్యింది. ఇప్పుడు కమలా హారిస్ కార్యాలయంపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News