Bangladesh border issue: బంగ్లాదేశ్ దౌత్యవేత్తను పిలిచి మాట్లాడిన భారత్

India, Bangladeshi border issue: ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ నురల్ ఇస్లాంను భారత విదేశీ వ్యవహారాల శాఖ పిలిపించి మాట్లాడింది. అంతకంటే ముందే ప్రణయ్ వర్మ సైతం భారత్ వైఖరిని బంగ్లాదేశ్ కు స్పష్టంగా చెప్పారు.

Update: 2025-01-13 16:25 GMT

Bangladesh border issue: బంగ్లాదేశ్ దౌత్యవేత్తను పిలిచి మాట్లాడిన భారత్

India, Bangladeshi border issue: ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 5 ప్రదేశాల్లో ఫెన్సింగ్ నిర్మించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఆరోపించింది. ఇదే విషయమై ఆదివారం బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశ రాజధాని ఢాకాలో ఉన్న ఇండియన్ హై కమిషనర్ ప్రణయ్ వర్మను పిలిచి మాట్లాడింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి జషీముద్దీన్, ప్రణయ్ వర్మ మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలకు ఇది విరుద్ధమని యూనస్ సర్కార్ ఆరోపించింది.


అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ నురల్ ఇస్లాంను భారత విదేశీ వ్యవహారాల శాఖ పిలిపించి మాట్లాడింది. అంతకంటే ముందే ప్రణయ్ వర్మ సైతం భారత్ వైఖరిని బంగ్లాదేశ్ కు స్పష్టంగా చెప్పారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నేరాల నియంత్రణకు కలిసి పనిచేయాల్సిందిగా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సరిహద్దుల్లో గస్తీ కాసే ఇండియన్ బార్డర్ సెక్యురిటీ ఫోర్స్, బంగ్లాదేశ్‌కు చెందిన బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. 

Tags:    

Similar News