ప్రారంభంరోజే కూలిపోయిన సీపాడ్.. పనామాలో నీటిపై తేలియాడే ఇల్లు

*300 గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు

Update: 2022-10-13 14:52 GMT

ప్రారంభంరోజే కూలిపోయిన సీపాడ్.. పనామాలో నీటిపై తేలియాడే ఇల్లు

SeaPod Collapse: నీటిపై ఇంటిని కట్టాలనుకున్నారు. అందుకు ఏకంగా 12 కోట్ల రూపాయలను వెచ్చించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.. నీటిలో తేలియాడుతో ఎంతో అందంగా కనిపించిన ఆ భవనాన్ని చూసి.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గృహ ప్రవేశానికి భారీగా అతిథులు వచ్చేశారు. స్వయంగా దేశ అధ్యక్షుడే ఆ రిబన్‌ కటింగ్‌ చేసి.. ప్రారంభించాలనుకున్నారు. ఇక రిబ్బన్ కట్టింగే ఆలస్యమని అందరూ అనుకున్నారు. అంతలోనే ఆ భవనం షాక్‌ ఇచ్చింది. కొన్ని రోజులుగా ఎంతో హుందాగా నిలిచిన ఆ భవనం నీళ్లలోకి ఒకవైపునకు ఒరిగిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అది చూసిన వారంతా చాలా భయపడిపోయారు. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోని పనామా దేశంలో సెప్టెంబరు 23న జరిగింది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

సీపాడ్ పేరుతో పనామాకు చెందిన ఓ కంపెనీ ఈ భవనాన్ని నిర్మించింది. దాని ప్రత్యేకత ఏమిటంటే.. నీళ్లలో తేలియాడుతూ ఉంటుంది. ఆ భవనంలో సుమారు 300 గజాల విస్తీర్ణంలో లివింగ్ రూం ఉంటుంది. ఆ బిల్డింగ్‌కి దూరంగా నీటి మట్టానికి 7.5 అడుగులు ఎత్తులో మూడు హాఫ్‌ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. సీపాడ్‌ నిర్మాణం కోసం 10 లక్షల డాలర్లను వెచ్చించారు. అంటే.. మన రూపాయల్లో అయితే దీని నిర్మాణ వ్యయం 12 కోట్ల రూపాయలు అయ్యింది. తేలియాడే ఇల్లు కూలిపోవడంపై నిర్మాణ సంస్థ వివరణ ఇచ్చింది. సీపాడ్‌లోని బాలాస్ట్ ట్యాంక్, పంపింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య తలెత్తి.. జాకూజీ స్పార్‌లోని నీళ్లు చేరాయని వెల్లడించింది. ఈ కారణంగానే సీపాడ్ ఇలా ఒరిగిపోయిందని... దాని వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. కనీసం ఆ ఇంటిలో ఉన్న ఎవరి కాళ్లు కూడా తడవ లేదని సదరు నిర్మాణ సంస్థ చెప్పొకొచ్చింది. అయితే బిల్డింగ్ కూలిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో భఆరీగా వైరల్‌ అవుతోంది. 

Tags:    

Similar News