Roshni Nadar Malhotra as New Chief of HCL Tech: హెచ్‌సిఎల్ చైర్‌పర్సన్‌గా రోష్ని నాడార్ మల్హోత్రా
Roshni Nadar Malhotra: భారతీయ ధనవంతురాలు రోష్ని నాడార్ మల్హోత్రాను హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు ఐటి దిగ్గజం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
Roshni Nadar Malhotra as New Chief of HCL Tech: భారతీయ ధనవంతురాలు రోష్ని నాడార్ మల్హోత్రాను హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు ఐటి దిగ్గజం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 38 ఏళ్ల మల్హోత్రా.. తన తండ్రి శివ నాడార్ ఈ పదవి నుంచి వైదొలిగిన తరువాత హెచ్‌సిఎల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. శివ నాడార్ హెచ్‌సిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. శివ్ నాడార్ యొక్క ఏకైక సంతానం రోష్ని నాడార్ మల్హోత్రా, ఆమె నిన్నటిదాకా హెచ్‌సిఎల్ కార్పొరేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఇఒ గా ఉన్నారు, అంతేకాదు హెచ్‌సిఎల్ టెక్ బోర్డు వైస్ చైర్పర్సన్ గాను.. శివ హెచ్‌సిఎల్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు.
హెచ్‌సిఎల్‌లో చేరిన ఏడాది తర్వాత హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మరియు హెచ్‌సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్ హోల్డింగ్ కంపెనీ అయిన హెచ్‌సిఎల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఇఒగా ఆమె ఎదిగారు. తరువాత 2013 లో హెచ్‌సిఎల్ టెక్ బోర్డుకు అదనపు డైరెక్టర్ గా నియమించారు. కొన్ని సంవత్సరాలుగా, మల్హోత్రా హెచ్‌సిఎల్ గ్రూప్‌లో బ్రాండ్ బిల్డింగ్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.
మల్హోత్రా ఢిల్లీలో పుట్టి పెరిగారు.. వసంత వ్యాలీ పాఠశాలలో చదివారు, తరువాత ఆమె నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్‌లో స్పెషలైజేషన్ కోర్స్ చేశారు. ఆ తరువాత ఆమె యునైటెడ్ స్టేట్స్ లోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉత్తీర్ణత సాధించారు. మల్హోత్రా అనేక సంవత్సరాలుగా అనేక ప్రశంసలు మరియు అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాదు ఆమె ఫోర్బ్స్ జాబితాలోని 2017 నుండి 2019 వరకు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.