భీకర విపత్తుతో అల్లాడుతున్న కెనడా.. కొట్టుకుపోయిన రోడ్లు, రైల్వే లైన్స్...
Canada: కెనడా వందేళ్ల చరిత్రలో భారీ వరదలు.. భారీగా విరిగిపడుతున్న కొండచరియలు...
Canada: వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో ఎదురైన విపత్తుతో కెనడా అల్లకల్లోలంగా మారిపోయింది. వాంకోవర్‌లో భీకర తుఫాన్ ధాటికి రోడ్లు, రైల్వే లైన్స్ నామరూపాల్లేకుండా పోయాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగి పడడంతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు గల్లంతయినట్లు తెలుస్తోంది. మొత్తంగా నెల రోజుల్లో కురవాల్సిన వర్షం 24గంటల్లోనే కురిసిందని కెనడా వాతావరణ శాఖ చెబుతోంది.
మరోవైపు.. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్క బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోనే వేలాది మందిని తరలించాల్సి వచ్చినట్లు కెనడా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో భీకరంగా ప్రవహిస్తున్న మంచునీటిలో కార్లకు కార్లే కొట్టుకుపోతున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కోసం కెనడా ప్రభుత్వం హెలికాప్టర్లను రంగంలోకి దించింది.