Bhopal Gas Tragedy Anniversary: భోపాల్ దుర్ఘటనకు నేటితో 40ఏళ్లు..ప్రపంచం మరవలేని విషాదం..నేటికీ ప్రభలుతున్న వ్యాధులు

Update: 2024-12-03 05:28 GMT

Bhopal Gas Tragedy Victims Clinical Analysis: 1984 డిసెంబర్ 3వ తేదీ...మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచం మరవలేని విషాదం నెలకొంది. ఈ ఘటన జరిగిన నేటికి 40ఏళ్లు పూర్తయ్యింది. ఇన్నేళ్లు దాటిని ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయివు మిథైల్ ఐసోసైనేట్ లీక్ అయిన ఈ ఘటన భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనగా నిలించింది. ఆ రోజు రాత్రి భోపాల్ నగరం గాఢ నిద్రలో ఉంది. ఒక్కసారి మ్రుత్యువు విషవాయువు రూపంలో ముంచుకొచ్చింది. లేక్కలేనంత విషాదాన్ని మిగుల్చింది. నాటి భయానక చిత్రాలు నేటికి అనే మంది కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల కోసం పనిచేస్తున్న సంస్థలు.. అప్పటి గ్యాస్ లీక్ ఇప్పటికీ అనే వ్యాధులను వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తుందని చెబుతున్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులతో కలిసి పనిచేస్తున్న సంభావన ట్రస్ట్ క్లినిక్ అనే సంస్థ, 16 సంవత్సరాల కాలంలో 16,305 మంది గ్యాస్ బాధిత, 8,106 మంది ప్రభావితం కాని రోగుల క్లినికల్ డేటా విశ్లేషణ ఆధారంగా కనుగొన్నట్లు తెలిపారు.

డాక్టర్ ఉషా ఆర్య మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలలో, శ్వాసకోశ.. మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధులు ప్రభావితం కాని సమూహం కంటే గ్యాస్ ప్రభావిత సమూహంలో 1.7 నుండి 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నామని తెలిపారు. గతంలో గ్యాస్ లీక్‌తో సంబంధం లేని మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు కూడా వేగంగా పెరిగాయి. బాధిత ప్రజలకు వైద్య పరిశోధనలు, మెరుగైన చికిత్స సౌకర్యాలు పెరగాల్సిన అవసరాన్ని ఈ డేటా వెలుగులోకి తెస్తోందని అన్నారు. గ్యాస్ పీడిత రోగుల్లో మధుమేహం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అదే సమయంలో, అధిక రక్తపోటు ప్రభావితం కాని వ్యక్తుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు గ్యాస్ ప్రభావిత వ్యక్తులలో డిప్రెషన్ సంభవం 2.7 రెట్లు ఎక్కువగా ఉందని.. అదే సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఏడు రెట్లు ఎక్కువగా పెరిగినట్లు చెప్పారు.

గైనకాలజిస్ట్ డాక్టర్ సోనాలి మిట్టల్ మాట్లాడుతూ.. గ్యాస్ పీడిత మహిళల్లో ప్రీమెచ్యూర్ లేదా ఎర్లీ మెనోపాజ్ కేసులు 2.6 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాధులు గ్యాస్ ప్రభావిత వ్యక్తులలో 4.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ బి రఘురామ్ చెప్పారు. నరాల వ్యాధులలో, హెమిప్లెజియా, న్యూరల్జియా సంభవం నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. హైపోథైరాయిడిజం గత ఏడు సంవత్సరాలలో రెండు గ్రూపులలో పెరిగింది. అయితే ఇది గ్యాస్-ప్రభావిత సమూహంలో 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

1984 డిసెంబర్ 2 అర్థరాత్రి నుంచి 3వ తేదీ తెల్లవారు జామున వరకు భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విషపూరిత మిథైల్ ఐసోసైనేట్ (MIC) వాయువు లీకైంది. ఈ ఘటనలో 5,479 మంది మరణించారు. ఐదు లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఇది ప్రపంచంలోని అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదాలలో ఒకటి. దాని బాధితులు ఇప్పటికీ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

Tags:    

Similar News