Clashes at Football match: పుట్ బాల్ మ్యాచ్ లో ఘర్షణ: 100 మంది మృతి

Clashes at Football Match: గినియాలో పుట్ బాల్ మ్యాచ్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు.

Update: 2024-12-02 07:25 GMT

పుట్ బాల్ మ్యాచ్ లో ఘర్షణ: 100 మంది మృతి

Clashes at Football Match: గినియాలో పుట్ బాల్ మ్యాచ్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. గినియా జుంటా నాయకులు దౌంబోయ్ గౌరవార్ధం పుట్ బాల్ నిర్వహించారు. నెర్ కోర్ లో లాబ్, నెచరెకోర్ జట్ల మధ్య పుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో రిఫరీ తీసుకున్న నిర్ణయం ఘర్షణకు కారణమైంది.

రిఫరీ నిర్ణయం నచ్చని ఒక జట్టు అభిమానులు మైదానంలోకి అడుగుపెట్టి గొడవకు దిగారు. ఇరువర్గాలు గ్రౌండ్ బయట కూడా పరస్పరం దాడులకు దిగారు. వందలాది మంది పరస్పరం దాడులు చేసుకున్నారు. అల్లరి మూకలు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో రోడ్లపైనే మృతదేహలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇప్పటి వరకు 100 మంది మరణించారని స్థానిక వైద్యుడు ఒకరు ప్రకటించారు.

Tags:    

Similar News