Donald Trump: బ్రిక్స్ దేశాలకు 100శాతం సుంకాల విధిస్తానంటూ ట్రంప్ వార్నింగ్..ఇది నిజంగా సాధ్యమేనా?

Update: 2024-12-02 03:59 GMT

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే ఏడాది జనవరి 20వ తారీఖున బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్..అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్తానంటూ..దీనికోసం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ సంకేతాలు సైతం ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు దేశాల వస్తువులపై దిగుమతి సుంకం పెంచక తప్పదంటూ స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే తమ డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఓ ప్రత్యేక కరెన్సీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న బ్రిక్స్ కూటమికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేక కరెన్సీ రూపకల్పనకు పుతిన్ పిలుపునిస్తే..అమెరికా డాలర్ ను పక్కనపెడితే చర్యలు తప్పవంటూ ట్రంప్ హెచ్చరించారు. అలా చేస్తే 100శాంతం సుంకం విధిస్తానంటూ బెదిరించాడు. అయితే ట్రంప్ హెచ్చరిక ఆచరణ సాధ్యమేనా? తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చైనా, మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా భారత్ సహా బ్రిక్స్ దేశాలను ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీ రూపొందించినట్లయితే వాటిపై 100శాతం సుంకం విధిస్తానంటూ బ్రిక్స్ దేశాలను డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు.

డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరి అయ్యింది కాదని పరిశోధనా సంస్థ GTRI ఆదివారం తెలిపింది. భారతదేశం ఆచరణీయ స్థానిక కరెన్సీ ట్రేడింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని GTRI తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2009లో ఏర్పడిన బ్రిక్స్ లో అమెరికా లేదు. ఈ గ్రూపులో దక్షిణాఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఉన్నాయి. తర్వాత కాలంలో బ్రిక్స్ లో అమెరికా చేరింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలపై అమెరికా పెత్తనం చూపించే ప్రయత్నం చేస్తోంది.

గత కొన్నేళ్లుగా అమెరికా, దాని సభ్య దేశాలలో కొన్ని దేశాలు ముఖ్యంగా రష్యా, చైనా, US డాలర్‌కు ప్రత్యామ్నాయాలను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. లేదంటే బ్రిక్స్ దేశాలు తమ స్వంత కరెన్సీని రూపొందించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి దేశాలకు ఉమ్మడి కరెన్సీకి సమయం ఇంకా ఆసన్నం కాలేదు. ఆ దిశలోనే అడుగులు వేస్తామని చెప్పారు.

ఎందుకంటే ఐరోపా సమాఖ్య ఎదుర్కొంటున్న సమస్యల కంటే పెద్దవి అవుతాయని..ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వినియోగించుకోవడానికి భారత్ తో కలిసి రష్యా పనిచేస్తోంది. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలి. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడి..డాలర్ వాడకం సరైందేనా అనే ఆలోచనలో ప్రపంచం ఉంది. అందుకే చెల్లింపులు, నిల్వల్లో దాని పరిమాణం క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచంలోని టారిఫ్ వార్ మొదలవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

GTRI వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, బ్రిక్స్ కరెన్సీని స్వీకరించే దేశాలపై 100 శాతం సుంకాలు విధించే ట్రంప్ బెదిరింపు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎందుకంటే భారత్ లో కరెన్సీని బహిరంగంగా మార్పిడి చేయడం అనేది స్థానిక వ్యాపారంపై భారీగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ సమయంలో భారత్ బ్రిక్స్ కరెన్సీకి అనుకూలంగా ఉండకపోవడమే మంచిది. భారత్ తన స్వంత ఆర్థిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటే.. ప్రపంచ వాణిజ్యంగా మారుతున్నడైనమిక్స్ ను మరింత శక్తివంతంగా నావిగేట్ చేసే సత్తా భారత్ కు ఉందని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

సార్వభౌమాధికార దేశాలను అమెరికా బెదిరించడం దౌత్య సంబంధాలను మరింత బలహీనపరుస్తుందని అజయ్ శ్రీవాస్తవ అన్నారు. అమెరికాతో సహా ఏ దేశమూ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోకుండా ఏకపక్షంగా ప్రపంచ ఆర్థిక విధానాలను నిర్ణయించలేవని అన్నారు. ఏ దేశమైనా సరే తమ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ హక్కు కూడా ఆ దేశాలకు ఉంటుంది. దేశానికి వ్యతిరేక వ్యవస్థలు ఉన్నప్పుడు వాటిని విస్మరిస్తాయి.

ఇప్పుడు భారత్ కూడా తనకు వ్యతిరేకంగా ఉండే విధానాలను వ్యతిరేకిస్తుందని చెప్పారు. అయితే అమెరికాను సుసంపన్నంగా మార్చే తన ప్రణాళిక సుంకం పెంపు చాలా ముఖ్యమైన అంశమని ట్రంప్ చెప్పారు. భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంచితే ట్రంప్ సర్కార్ పలు ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొవల్సి వస్తుందని శ్రీవాస్తవ చెప్పారు. ట్రంప్ 100శాతం సుంకం విధిస్తానని చెప్పడం..అది ఆచరణ సాధ్యం కాదన్నారు.

Tags:    

Similar News