Canada: సెంట్రల్ కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Canada: మృతి చెందిన వారి కుటుంబాలకు కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడ్‌ సంతాపం

Update: 2023-06-17 04:49 GMT

Canada: సెంట్రల్ కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

Canada: సెంట్రల్‌ కెనడాలోని మానిటోబా ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, సెమీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది దుర్మరణ చెందారు. పది మందికి పైగా గాయాలపాలయ్యారు. విన్నిపెగ్‌కు పశ్చిమాన ఉన్న కార్బెర్రీ పట్టణానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాణనష్టానికి కెనడియన్‌ పోలీసులు తమ ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం హైవే వన్‌ - హౌవే ఫైవ్‌ కూడలి వద్ద బస్సు సెమీ ట్రక్కును ఢీకొట్టిందని, ఈ బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారని రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ మానిటోబా అధికారి రాబ్‌ హిల్‌ ప్రకటించారు. ప్రయాణికుల్లో ఎక్కువమంది వృద్ధులే ఉన్నారని, 15 మంది మృతి చెందారని ప్రకటించారు. పదిమందికి గాయాలయ్యాయన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పారు...

కాగా, ఈ రోడ్డు ప్రమాదంలో సెమీ ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయిందని, ఆ వాహనం పూర్తిగా కాలిపోయిందని కెనడియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ మీడియా పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో అనేక అత్యవసర వాహనాలు, రెండు హెలికాప్టర్లు ఉన్నాయని, ప్రమాద స్థలానికి సమీపంలో రోడ్డు పక్కన ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ప్రమాదంలో సెమీ ట్రక్కు వాహనం కాలిపోతూ... మంటలు ఎగిసిపడ్డాయని, దీంతో ఆ ప్రదేశమంతా పొగ కమ్ముకుందని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడ్‌ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం విషాదకరమైనదని, ఈ ఘటనలో తమ బంధువులను కోల్పోయిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

Tags:    

Similar News