America: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం

America: రోడ్డుప్రమాదంలో అమలాపురం వాసులు మృతి

Update: 2023-12-27 07:14 GMT

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం

America: అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుప్రమాదంలో ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులు మృతి చెందారు. మృతులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ చిన్నాన్న కుటుంబంగా గుర్తించారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మీ, వారి కుమార్తె నవీన, మనవడు, మనవరాలుగా గుర్తించారు. ప్రమాదంలో నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News