Israel Hezbollah War: హిజ్బుల్లాకు దెబ్బ మీద దెబ్బ..సస్రల్లా తర్వాత ప్రివెంటివ్ సెక్యూరిటీ యూనిట్ కమాండర్ నబిల్ కౌక్ హతం
Israel Hezbollah War: హసన్ నస్రల్లా మరణం తర్వాత.. హిజ్బుల్లా మరొక ప్రధాన కమాండర్‌ను మట్టుబెట్టింది ఇజ్రాయెల్ సైన్యం. ఐడిఎఫ్ వైమానిక దాడిలో హిజ్బుల్లా ప్రివెంటివ్ సెక్యూరిటీ యూనిట్ కమాండర్ నబిల్ కౌక్‌ను హతమార్చింది.
Israel Hezbollah War: హిజ్బుల్లా టాప్ కమాండర్ హసన్ నస్రల్లాను హతమార్చి కూడా ఇజ్రాయెల్ దూకుడు ఆగడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాను టార్గెట్ చేస్తూ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. హిజ్బుల్లా ప్రివెంటివ్ సెక్యూరిటీ యూనిట్ కమాండర్, దాని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు నబిల్ కౌక్ ను హంతమొందించింది. లెబనాన్‌పై జరిగిన తాజా IDF దాడిలో నబిల్ కౌక్ మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
క్వాక్ సీనియర్ హిజ్బుల్లా కమాండర్లకు సన్నిహితంగా ఉండేవాడు. ఇజ్రాయెల్ రాష్ట్రం, దాని పౌరులకు వ్యతిరేకంగా తీవ్రవాద దాడులలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. అతను 1980లలో హిజ్బుల్లాలో చేరాడు. అతని రంగంలో నైపుణ్యం, ముఖ్యమైన నేతగా ఎదిగాడు. అతను ఆపరేషనల్ కౌన్సిల్‌లో సదరన్ ఏరియా కమాండర్‌గా, డిప్యూటీ కమాండర్, ఆపరేషనల్ కౌన్సిల్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేశాడు.
హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ, దాని కమాండర్లపై దాడి చేసి నిర్మూలించడం కొనసాగిస్తామని IDF చెబుతోంది. రాష్ట్ర పౌరులను బెదిరించే వారిపై ఇజ్రాయెల్ చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కౌక్ 1980ల నుండి సీనియర్ హిజ్బుల్లా సభ్యుడు. గతంలో దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా యొక్క సైనిక కమాండర్‌గా పనిచేశాడు. 2020లో అమెరికా అతనిపై ఆంక్షలు విధించింది.