Russia- North Korea: ఉత్తర కొరియా, రష్యా మధ్య భాగస్వామ్య ఒప్పందం

Russia- North Korea: శత్రువు దాడి చేసిన సమయంలో పరస్పరం... సహకరించుకోవాలని నిర్ణయించిన ఇరుదేశాలు

Update: 2024-06-20 12:03 GMT

Russia- North korea: ఉత్తర కొరియా, రష్యా మధ్య భాగస్వామ్య ఒప్పందం

Russia- North Korea: ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంతకాలు చేశారు. ఇది తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైలురాయిగా ఇద్దరు దేశాధినేతలు తెలిపారు. శత్రువు దాడి చేసిన సమయంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడంతో పాటు భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పేర్కొన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్‌ విభాగాల్లో ఇరు దేశాలు సహాకారం అందించుకునేలా పలు ఒప్పందాలు పుతిన్, కిమ్ చేసుకున్నారు.

Tags:    

Similar News