Nobel prizes 2024: వైద్య రంగంలో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ ప్రైజ్.. వాళ్లు ఏం చేశారంటే..

Update: 2024-10-07 11:52 GMT

Nobel prizes 2024: వైద్య శాస్త్రంలో ప్రయోగాలు చేసిన అమెరికాకు చెందిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ ప్రైజ్ వరించింది. తమ ప్రయోగాలతో మైక్రో ఆర్ఎన్ఏని కనుగొన్నందుకు వీరికి జాయింట్‌గా నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ స్పష్టంచేసింది. జీన్ రెగ్యులేషన్‌లో ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎవరీ ఆంబ్రోస్, గ్యారీలు?

ఆంబ్రోస్ ప్రస్తుతం మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వయస్సు 70 ఏళ్లు. ఇక గ్యారీ విషయానికొస్తే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో గ్యారీ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఈయన వయస్సు 72 ఏళ్లు. జన్యూ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏలను గుర్తించడం అనేది మెడికల్ సైన్స్‌లో మరో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించినట్లయిందని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ తమ ప్రకటనలో పేర్కొంది.

2002 లో నోబెల్ అందుకున్న రాబర్ట్ హార్విజ్ నేతృత్వంలోని ల్యాబోరేటరీలో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌ పోస్ట్ డాక్టోరల్ ఫెల్లోస్‌గా తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ 10 స్టాక్ హోమ్ లో నిర్వహించే నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో వీరికి ఈ నోబెల్ బహుమతి అందించనున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1896 లో చనిపోయారు. ఆయన రాసిన తన చివరి వీలునామా ప్రకారమే ఈ నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. నోబెల్ అవార్డు బహూకరణలో భాగంగా వారికి ఒక డిప్లోమా, గోల్డ్ మెడల్, 10 లక్షల డాలర్ల చెక్ అందించనున్నారు. 

Tags:    

Similar News