Pakistan Foreigh Minister Shah Mahmood Qureshi: కరోనా బారిన పడి విదేశాంగ మంత్రి మరణించినట్లు వదంతులు

Pakistan Foreigh Minister Shah Mahmood Qureshi: పాకిస్తాన్‌లో గురువారం కరోనా బారిన పడిన ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మరణించినట్లు వదంతులు వ్యాపించాయి.

Update: 2020-07-10 09:00 GMT
Pakistan Foreigh Minister Shah Mahmood Qureshi (File Photo)

Pakistan Foreigh Minister Shah Mahmood Qureshi: పాకిస్తాన్‌లో గురువారం కరోనా బారిన పడిన ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మరణించినట్లు వదంతులు వ్యాపించాయి. ఇది నిజమనుకొని చాలా మంది ఆయనకు నివాళులు అర్పించారు. తీరా చూస్తే ఇది ఫేక్ వార్త అని అర్ధమైంది. దీనిపై గురువారం అర్థరాత్రి ఖురేషి స్వయంగా వివరణ ఇచ్చారు. తన మరణ వార్త శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. తాను బాగున్నానని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని చెప్పారు. ఈ తప్పుడు వార్తలతో నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారని ఆయన అన్నారు. తప్పుడు వార్తలపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కాగా శనివారం, ఖురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో లాహోర్ లోని మిలిటరీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కాసేపటికే ఆయన మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పాక్ ప్రభుత్వ అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంతమంది చట్టసభసభ్యులు మంత్రి మృతిచెందారన్న వదంతులుతో నివాళులు కూడా అర్పించారు. అయితే మంత్రి వివరణ ఇవ్వడంతో ఆ ఆవార్త నిజం కాదని తేలింది. కాగా పాకిస్థాన్ లో ప్రస్తుతం రెండు లక్షలా 44 వేల కరోనా కేసులున్నాయి. ఇందులో లక్షన్నరమంది దాకా కోలుకున్నారు. అలాగే 5,058 మంది కరోనా భారిన పడి మరణించారు.


Tags:    

Similar News