Pakistan: ప్రధాని పదవి కాపాడుకోనుందుకు ఇమ్రాన్ తంటాలు

Pakistan: *అసెంబ్లీలో ఇమ్రాన్ సర్కారు బలం 178 మంది సభ్యులు *పాకిస్తాన్ అసెంబ్లీ మొత్తం సభ్యులు 342

Update: 2022-03-28 09:51 GMT

ప్రధాని పదవి కాపాడుకోనుందుకు ఇమ్రాన్ తంటాలు

 Pakistan: పాకిస్తాన్‌లో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయ్. నిన్న సిచ్యువేషన్ ఒకలా ఉంటే ఇవాళ మరోలా ఉంది. ప్రధాని పదవిని కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ నానా తంటాలు పడుతున్నారు. విపక్షాలు కుట్ర చేసి తన సర్కారును కూలదోయాలని చూశాయంటూ నిన్నటి వరకు చెప్పిన ఇమ్రాన్ ఇప్పుడు విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఇమ్రాన్ విఫలమయ్యాడంటూ కాసేపట్లో నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు రానుంది.

విదేశాల్లో జరుగుతున్నకుట్ర ఏంటో తెలుసునన్నారు ఇమ్రాన్ అందుకు సంబంధించిన ప్రూవ్స్ కూడా ఉన్నాయన్నారు. ఇమ్రాన్ ఖాన్ సర్కారు గతంలోని జుల్ఫికర్ అలీ భుట్టో కాలం నాటిది కాదని కుట్రదారులు గుర్తుంచుకోవాలన్నారు. ముషారఫ్‌లా దేశం వదలి పోనన్నారు. మాజీ నియంత ముషారఫ్‌లా తాను లొంగిపోవాలని కొందరు కోరుకుంటున్నారన్నారు. లండన్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారంటూ ఖాన్ దొప్పిపొడిచారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు నిధులు పారిస్తున్నారని దేశంపై బయట శక్తుల ప్రమేయాన్ని పెత్తనాన్ని అంగీకరించబోనన్నారు.

ఇస్లామాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ర్యాలీలో సర్కారు గొప్పలు చెప్పిన ఇమ్రాన్ విపక్షాలన్నీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. కుట్రలు తెలిసినప్పటికీ అన్నిటినీ దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని చెప్పలేనన్నారు. వైట్ కాలర్ నేరస్తులను పట్టుకోవడంలో చట్టాలు విఫలమయ్యాయని వారందరూ కూడబెట్టిన డబ్బుతో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దూసుకొస్తుందని ఎలాంటి విషయాలను దాచలేమన్నారు. అందరితో స్నేహంగా ఉంటాం కానీ ఎవరికి లోంగనన్నారు.

సంకీర్ణ సర్కారు నుంచి పలు పార్టీలు తప్పుకోవడంతో ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయ్. పాకిస్తాన్ అసెంబ్లీ మొత్తం సభ్యులు 342 ఉండగా... ఇమ్రాన్ సర్కారు బలం 178 మంది సభ్యులుగా ఉంది. ఐతే అవిశ్వాసం నెగ్గడానికి 172 మంది సభ్యులు అవసరం కాగా ప్రస్తుతం విపక్షానికి 163 మంది సబ్యుల అధికార తెరీక్ ఇ ఇన్సాఫ్ బలం 155గా ఉంది. ప్రస్తుతం సభలో విపక్షాల బలం 163. అయితే సొంత పార్టీలోనే తిరుగుబాటు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు సమస్యగా మారాయ్. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ సభ్యులు గళం విప్పడంతో భవిష్యత్ ఏంటో అర్థం కాక తలపట్టుకుంటున్నాడు. పాక్ అసెంబ్లీలో అవిశ్వాసం నెగ్గితే రాజీనామా చేసిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డుల్లోకి ఎక్కుతారు.

మరోవైపు ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ్. ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని ఇమ్రాన్‌ను విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ్. ఇంకా ఎన్నాళ్లు ప్రధాని పీఠం పట్టుకొని వేళాడుతున్నారంటూ విమర్శించారు. తనో పెద్ద నాయకుడిగా ఇమ్రాన్ భ్రమపడుతున్నాడని ముస్లిం వరల్డ్ మొత్తానికి నాయకుడనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ కేవలం పాకిస్తాన్ ప్రధాని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్నారు. మొత్తంగా పాకిస్తాన్ లో ఇమ్రాన్ సర్కారు ఉంటుందో ఊడుతుంటో మరికాసేపట్లో తేలనుంది.

Tags:    

Similar News