Kim Jong Un in coma: కోమాలో ఉత్తరకొరియా నియంత కిమ్!
Kim Jong Un in coma: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారని, లేదు అతడు చనిపోయాడనే ఊహాగానాలు మరోసారి ప్రపంచ మీడియాలో గుప్పుమంటున్నాయి.
North Korea's Kim Jong Un in coma: ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారని, లేదు అతడు చనిపోయాడనే ఊహాగానాలు మరోసారి ప్రపంచ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఆయన స్థానంలో కిమ్ యో జోంగ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టానున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కిమ్ యో జోంగ్‌కు అధ్యక్షుడు కిమ్ కొన్ని అధికారులు కట్టబెట్టారని పలు వార్తలు మీడియాలో ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిమ్ చూసుకునే విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైనిక రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల లాంటి ముఖ్యమైనవన్నీ కూడా ఇకపై కిమ్ యో జాంగ్ పర్యవేక్షిస్తారని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.
ఈ తరుణంలోనే ఆ దేశ అధికారి చాంగ్ సాంగ్ మిన్ కూడా కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ గూఢచర్య వర్గాలు తెలిపాయని వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలను కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ చూస్తున్నారని పేర్కొన్నారు. ఈలాంటి ప్రకటన కూడా కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం చేయడానికి ఊతమిస్తున్నాయి.
కాగా, గతంలో కూడా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇలాంటి పుకార్లు ఎన్నో వచ్చాయి. కొంతమంది కిమ్ చనిపోయారని అంటే.. మరికొందరు అతడి ఆరోగ్యం క్షీణించిందని.. ఇంకొందరు ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని అన్నారు.ఆ తరువాత అతడు బయటకు వచ్చి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగిపోయింది. మరి.. ఈసారి తన ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలపై కిమ్ ఏ రకంగా సమాధానం చెబుతారో చూడాలి.