భారత భూభాగాలను కలిపే 'మ్యాప్'నకు నేపాల్ ఎగువ సభ ఆమోదం
భారత భూభాగాలను తమవిగా చెప్పుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ‘మ్యాప్’నకు నేపాల్ ఎగువ సభ ఆమోదం లభించింది. వివాదాస్పద భూభాగాలను కలిపే కొత్త మ్యాప్ సవరణ బిల్లు ప్రతిపాదనను నేపాల్ పార్లమెంటు ఆమోదించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.
భారత భూభాగాలను తమవిగా చెప్పుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద 'మ్యాప్'నకు నేపాల్ ఎగువ సభ ఆమోదం లభించింది. వివాదాస్పద భూభాగాలను కలిపే కొత్త మ్యాప్ సవరణ బిల్లు ప్రతిపాదనను నేపాల్ పార్లమెంటు ఎగువ సభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదని వివరించింది. దేశ రాజకీయ పటాన్ని నవీకరించే ప్రతిపాదనను నేపాల్ పార్లమెంటు ఆదివారం ఆమోదించడంతో ఈ బిల్లు ఎగువ సభకు వచ్చింది.
దీంతో దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు ఎంపీలు. కాగా భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ తీసుకొచ్చింది. 2019 నవంబర్‌లో భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్‌లో ఈ ప్రాంతాలను భారత భూభాగంగాలో చూపించారు. అంతేకాదు అధికారికంగా కాలాపానీ ప్రాంతం ఉత్తరాఖండ్ లోని పితోర్ గఢ్ జిల్లాలో ఉంది.