NASA: అరుణగ్రహంపై రోవర్ శబ్ధాలను విడుదల చేసిన నాసా
NASA: అరుణ గ్రహంపైకి నాసా పంపించిన రోవర్ తన కదలికల శబ్దాలను రికార్డ్ చేసి భూమి మీదకి పంపింది.
NASA: అరుణ గ్రహంపైకి నాసా పంపించిన రోవర్ తన కదలికల శబ్దాలను రికార్డ్ చేసి భూమి మీదకి పంపింది. రోవర్ పర్సెవరెన్స్‌ను రెండు వారాల క్రిందట తొలిసారి అంగారకుడిపై నడిపారు. ఆ సందర్భంగా రోవర్‌కు ఉన్న ఆరు లోహపు చక్రాలు, సస్పెన్షన్‌ల నుంచి వెలువడిన ధ్వనులను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా విడుదల చేసింది. ఈ ధ్వనుల్లో పిండిమర శబ్ధం, తీవ్రమైన కీచు ధ్వని, కర్ణకఠోరమైన పెద్ద శబ్ధం వంటివి ఉన్నాయి. భూమి మీద ప్రమాణాలతో పోలిస్తే..అరుణగ్రహం మీద వచ్చిన శబ్దాలు చాలా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని నాసా తెలిపింది. గత నెలలో అరుణగ్రహం మీదకు దిగిన రోవర్‌కు శబ్దాలు రికార్డ‌్ చేసే రెండు మైక్రో ఫోన్లను బిగించారు.