Mukesh Ambani: రూ.640 కోట్లతో విల్లా కొన్న అంబానీ

Mukesh Ambani: దుబాయ్‌లోని పామ్‌ జుమైరాలో విల్లా, 10 బెడ్‌రూమ్‌లతో విలాసవంతమైన భవనం

Update: 2022-08-29 03:01 GMT
Mukesh Ambani Bought a Villa for Rs.640 Crores

Mukesh Ambani: రూ.640 కోట్లతో విల్లా కొన్న అంబానీ

  • whatsapp icon

Mukesh Ambani: దుబాయ్‌.. ఈ పేరు వింటే.. టక్కున గుర్తొచ్చేది విలాసాలు, వినోదాలు.. భూతల స్వర్గంగా పేరున్న దుబాయ్‌లో.. అందమైన బీచ్‌లు.. విలాసవంతమైన విల్లాలతో ఎంతో రిచ్‌గా కనిపిస్తుందీ నగరం. అక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్‌ జుమైరా దీవి ఎంతో ప్రసిద్ధి చెందింది. పామ్‌ జుమేరాలో ఖరీదైన విల్లాలను కొనుగోలు చేసేందుకు ప్రపంచ కుబేరులు ఎంతో ఆసక్తి చూపుతారు. తాజాగా ఈ దీవిలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌.. ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశారాట.. అందుకు 8 కోట్ల డాలర్లను వెచ్చించినట్టు తెలుస్తోంది. మన రూపాయల్లో దాని ఖరీదు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు మరీ.. ఆ విల్లా ఖరీదు 640 కోట్ల రూపాయలు.

Tags:    

Similar News