America: బఫెలో నగరంలో 52 అంగుళాల మేర పేరుకుపోయిన మంచు

America: మంచు ధాటికి 60కిపైగా మంది మృతి

Update: 2022-12-29 03:33 GMT

America: బఫెలో నగరంలో 52 అంగుళాల మేర పేరుకుపోయిన మంచు

America: మంచు తుఫాన్‌కు అమెరికా గడ్డకట్టుకుపోయింది. దేశవ్యాప్తంగా మంచు ధాటికి 60కిపైగా మంది చనిపోయారు. న్యూయార్క్‌లోని ఎరీ కౌంటీలో మంచు తుఫాన్ మృతుల సంఖ్య 37కి పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 52 అంగుళాల మంచు బఫెలో నగరాన్ని కప్పేసింది. రోడ్లపై పేరుకుపోతున్న మంచుతో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా చాలా నగరాల్లో మైనస్ 40 డిగ్రీల కన్నా తీవ్రమైన చలి నమోదవుతోంది. దీంతో 20 కోట్ల మంది బాంబ్ సైక్లోన్ ప్రభావానికి లోనైనట్టు అధికారులు తెలిపారు. అంటే అమెరికా మొత్తం జనాభాలో మూడింట రెండోంతుల మంది మంచుకు నానా ఇవ్వందులు పడుతున్నారు. ప్రస్తుతం 15 లక్షల మంది విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లలో కాలం వెళ్లదీస్తున్నారు. తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 16 వేల విమాన సర్వీసులను అమెరికా రద్దు చేసింది. మరోవైపు మంచు తుఫాన్‌పై మరింత అప్రమత్తంగా ఉండాలని 10 రాష్ట్రాలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మాంటెన్నా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, మిన్నెసోటా, ఐయోవా, ఇండియానా, మిషిగన్, నెబ్రాస్కా, విస్కాన్సిన్, న్యూయార్క్ రాష్ట్రాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News