Yahya Sinwar: యాహ్వా సిన్వార్ చనిపోయాడు.. ఇజ్రాయెల్ డ్రోన్ కెమెరా తీసిన చివరి క్షణాల వీడియో వైరల్

Update: 2024-10-18 06:09 GMT

Yahya Sinwar Last Moments video: హమాస్ ఉగ్రవాద సంస్థ అధినేత యాహ్వా సిన్వార్ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాహ్వా సిన్వార్ ఆఖరి క్షణాలకు సంబంధించిన వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాహ్వా సిన్వార్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన ఆ వీడియోను పరిశీలిస్తే.. ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలమైన భవనంలో దుమ్ముదూళిపారిన సోఫాలపై ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. డ్రోన్ తనవైపే వస్తుండటాన్ని గమనించిన ఆ వ్యక్తి.. తన చేతిలో ఉన్న కర్రను దానివైపు విసరడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అతడే యహ్యా సిన్వర్ అని ఇజ్రాయెల్ ప్రకటించింది.

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. హమాస్ దాడుల్లో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరో 251 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బంధీలుగా తీసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులు దాటి గాజాకి తీసుకెళ్లింది. ఈ మొత్తం దాడికి హమాస్ ఉగ్రవాద సంస్థను ముందుండి నడిపిస్తున్న యాహ్వా సిన్వార్ మాస్టర్ మైండ్‌గా ఇజ్రాయెల్ ఆరోపించింది. అప్పటినుండి యాహ్వా సిన్వార్ కోసం ప్రతీ అంగుళం గాలించింది.

యాహ్వా సిన్వార్ ఆచూకీ చెబితే 4 లక్షల డాలర్ల నజరానా

యాహ్వా సిన్వార్ ఆచూకీ కోసం లెబనాన్, పాలస్తినా, ఇరాన్‌తో పాటు పలు ఇతర దేశాల్లోనూ ఇజ్రాయెల్ ఏజెంట్స్ అన్వేషించారు. ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా సిన్వర్ జాడ దొరకలేదు. దాంతో అతడి ఆచూకీ చెప్పిన వారికి 4 లక్షల డాలర్లు నజరానాగా అందించనున్నట్లు ప్రకటించింది. వీలైతే ప్రాణాలతో పట్టుకోవాలని, లేదంటే మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది.  

సిన్వర్‌ని హతమార్చి తమ ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు హమాస్ చెరలో బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను విడిపించుకోవాలనేది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్లాన్. 

యాహ్వా సిన్వర్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం ఎలా ప్లాన్ చేసిందంటే..

బంధీలుగా తీసుకున్న ఇజ్రాయెల్ వాసులను యాహ్వా సిన్వార్ తన చుట్టూ షీల్డ్‌గా పెట్టుకుని ఆ శిథిలమైన భవనంలో తలదాచుకున్నట్లు ఇజ్రాయెల్ అనుమానించింది. అందుకే ముందుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ బలగాలు డ్రోన్ కెమెరాను ప్రయోగించి శిథిలమైన భవనంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో ఇజ్రాయెల్ వాసులు కనిపించలేదు కానీ అక్కడ ముగ్గురు హమాస్ మిలిటెంట్స్ తచ్చాడుతుండటం కనిపించింది. అప్పుడు అక్కడ ఉన్నది యాహ్వా సిన్వార్ అని కూడా ఇజ్రాయెల్ అనుకోలేదు. కానీ ఏదేమైనా ఆ భవనంలో హమాస్ మిలిటెంట్స్ ఉన్నారు కదా అనే ఉద్దేశంతో ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించింది.

బాంబుల దాడిలో భవనం శిథిలమైన అనంతరం ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి చూశాయి. అందులో ముందుగా డ్రోన్ కెమెరా రికార్డు చేసిన వ్యక్తి చనిపోయి కనిపించాడు. అతడి పోలికలు యహ్యా సిన్వర్ పోలీకలతో మ్యాచ్ అయ్యాయి. వెంటనే అతడి గడ్డంలోంచి వెంట్రుకలు తీసి డిఎన్ఏ పరీక్షలకు పంపించారు. గతంలో యాహ్వా సిన్వార్ ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు సేకరించిన శాంపిల్స్‌తో ఇవి మ్యాచ్ చేసి చూడగా సరిగ్గా సరిపోయాయని.. డిఎన్ఏ పరీక్షల తరువాతే అతడు చనిపోయాడని ధృవీకరిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. 

Tags:    

Similar News