Russia-Ukraine war: ఉక్రెయిన్ లోని భారతీయులకు కేంద్రం కీలక సూచనలు
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన నేపథ్యంలో భారత విదేశాంగశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన నేపథ్యంలో భారత విదేశాంగశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్లను ఎక్కడివారక్కడే ఆగిపోవాలంటూ తెలిపింది. సురక్షిత ప్రాంతాలకు చేరుకొని ఉక్రెయిన్‌లో పరిస్థితి చక్కబడే వరకు వేచి చూడాలని సూచించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమ ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది. ఉక్రెయిన్ క్రైసిస్ నేపథ్యంలో విదేశాంగశాఖ ఇప్పటికే హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రకటించింది.
ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు స్పెషల్ ఫ్లైట్‌లను పంపారు. అయితే ప్రతీ విమానంలో రెండు వందల మంది చొప్పున ప్రయాణికులు ఇండియాకు గత రెండు రోజుల్లో చేరుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27న మూడు విమానాలు కీవ్ నుంచి న్యూ ఢిల్లీ రావాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్ స్పేస్ మూసేయడంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి కీవ్ ఎయిర్‌పోర్టుకు వచ్చే వారిని ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలంటూ భారత ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని కొంత మేరకు సేఫ్‌గా ఉన్న పశ్చిమ ప్రాంతాల వారిని తిరిగి అదే ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది.
రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులపై ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.