Los Angeles: కోర్టులో బ్రిట్నీ స్పియర్స్‌కు ఎదురుదెబ్బ
Los Angeles: పాప్ దిగ్గజం బ్రిట్నీ స్పియర్స్‌కు లాస్ ఏంజెల్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Los Angeles: పాప్ దిగ్గజం బ్రిట్నీ స్పియర్స్‌కు లాస్ ఏంజెల్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన తండ్రి నుంచి విముక్తి కావాలంటూ కోర్టును వేడుకున్నప్పటికీ లాస్ ఏంజెల్స్ కోర్టు బ్రిట్నీ వాదనను తోసిపుచ్చింది. బ్రిట్నీ కో-కన్జర్వేటర్‌గా జెమీ స్పియర్స్‌ను తొలగించాలన్న విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. జూన్ 23న బ్రిట్నీ వర్చువల్‌గా తన తండ్రి ఆగడాలపై స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన తండ్రిపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె తనను నియంత్రించేలా జేమీ వ్యవహరించారని వాపోయింది. గోప్యంగా బట్టలు మార్చుకునేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వలేదంటూ సంచలన ఆరోపణలు చేసింది.
మరోవైపు బ్రిట్నీ తండ్రి జేమీ స్పియర్స్ వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. బ్రిట్నీ సంరక్షణ కోసం ఏం చేయాలో అదే చేశానని జేమీ కోర్టుకు తెలిపారు. బ్రిట్నీ వ్యక్తిగత నిర్ణయాలపై తనకు అధికారం ఉన్నప్పటికీ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. ఒకవేళ బ్రిట్నీ ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని జేమీ స్పియర్స్ న్యాస్థానానికి స్పష్టం చేశారు.