Flying Car: ఎయిర్‌కారును రూపొందించిన క్లీన్‌ విజన్‌ సంస్థ

Flying Car: విజయవంతంగా ఎయిర్‌కారు ట్రయల్‌ రన్‌ పూర్తి * 2.15 నిమిషాల్లో విమానంగా రూపాంతరం

Update: 2021-07-03 06:15 GMT
క్లీన్ విజన్ కంపెనీ తయారుచేసిన ఎగిరే కారు (ఫైల్ ఇమేజ్)

Flying Car: ఎగిరే కారు వచ్చేసింది. వెయ్యి కిలోమీటర్లలోపు ప్రయాణాలకు ఇది ఎయిర్‌ట్యాక్సీలాగా పనిచేస్తుంది. క్లీన్‌ విజన్‌ అనే సంస్థ సహకారంతో మధ్య ఐరోపా దేశమైన స్లోవేకియాకు చెందిన ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ క్లెయిన్‌, ఆంటోన్‌ జాజాక్‌ దీన్ని రూపొందించారు. ఈ ఎయిర్‌కార్‌ విజయవంతంగా ట్రయల్‌ రన్‌ను పూర్తిచేసుకుంది. 8వేల 200 అడుగుల ఎత్తులో.. గంటకు సుమారు 190 కిలోమీటర్ల వేగంతో బ్రాటిస్లావాను చేరుకుంది.

ఈ ఎయిర్‌కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. అయితే.. ఇది డ్రోన్‌ మాదిరిగా ఎక్కడి నుంచైనా ఎగరలేదు. 2 నిమిషాల 15 సెకండ్లలోనే విమానంగా మారిపోయే ఈకారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఇక ఈ కారు తయారీకి రెండేళ్ల సమయం పట్టిందని ఆకారు సృష్టికర్త స్టీఫెన్‌ క్లిన్‌ వివరించారు.

Tags:    

Similar News