జో బైడెన్ కి ట్విట్టర్ లో పెరుగుతున్న క్రేజ్..
ఇక ట్రంప్ కి ట్విట్టర్ లో ఫాలోవర్లు సంఖ్య 80 మిలియన్లుగా ఉంది.. ట్రంప్ తో పోలిస్తే జో బైడెన్ చాలా వెనుకబడి ఉన్నాడని చెప్పాలి.. అయితే త్వరలోనే జో బైడెన్ ట్రంప్ ని దాటేస్తాడన్న చర్చ నడుస్తోంది.
హోరాహోరిగా సాగిన అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పైన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను బైడెన్ 284 ఓట్లు సాధించగా, డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు. దీనితో అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చే ఏడాది జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే జో బైడెన్ కి ట్విట్టర్ లో క్రేజ్ పెరుగుతుంది.. ఆయనకి ట్విట్టర్ ఫాలోవర్లు క్రమంగా పెరుగుతున్నారు.. ప్రెసిడెంట్ కాకముందు ఆయనకి 14.4 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, ప్రెసిడెంట్ అవగానే మిలియన్ల ఫాలోవర్లు సంఖ్య 16 మిలియన్లను దాటేసింది.. ఆ సంఖ్యా ఇంకా పెరుగుతుంది కూడా.. ఇక అటు జో బైడెన్ కూడా తన ప్రొఫైల్ పిక్ ను అప్లోడ్ చేయడంతో మరింత జోష్ పెరిగింది..
ఇక ట్రంప్ కి ట్విట్టర్ లో ఫాలోవర్లు సంఖ్య 80 మిలియన్లుగా ఉంది.. ట్రంప్ తో పోలిస్తే జో బైడెన్ చాలా వెనుకబడి ఉన్నాడని చెప్పాలి.. అయితే త్వరలోనే జో బైడెన్ ట్రంప్ ని దాటేస్తాడన్న చర్చ నడుస్తోంది. చూడాలి మరి అది ఎప్పుడు జరుగుతుందో..