రఫాలో ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఘటనలో 45 సామాన్య పౌరులు మృతి

Israel-Hamas Conflict: రఫాలో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-05-28 04:44 GMT

రఫాలో ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఘటనలో 45 సామాన్య పౌరులు మృతి

Israel-Hamas Conflict: రఫాలో ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ‎ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. రెండు వారాల క్రితం ఇజ్రాయెల్ దళాలు తూర్పు రఫాలోని దాడిని ప్రారంభించింది. దీంతో టెల్ అల్ సుల్తాన్ పరిసర ప్రాంతాన్ని సురక్షితంగా ఇజ్రాయెలే ప్రకటించింది. అయితే అక్కడే చాలా మంది తలదాచుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడం విమర్శలకు దారి తీస్తోంది.

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఒక్కసారిగా దాడి జరిగిందని అక్కడి స్థానికులు తెలిపారు. అంతలోనే భారీ శబ్ధాలు వచ్చాయని, వెంటనే మంటలు చెలరేగినట్లు తెలిపారు. రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఘోరాన్ని ఆపాలని హెచ్చరించింది.

Tags:    

Similar News