వచ్చే శీతాకాలం అమెరికా కు గడ్డుకాలం కానుందా?

Update: 2020-04-24 04:22 GMT

అగ్రరాజ్య అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే అమెరికాలో ముందు ముందు పరిస్థితి చేజారిపోతుంది. వచ్చే శీతాకాలంలో ఈ వైరస్ తిరగబడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా వైరస్ అమెరికాలో కల్లోలం సృష్టింస్తుంది. కంటికి కనిపించని ఈ వైరస్ అగ్రదేశాన్ని శవాల దిబ్బగా మారుస్తుంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది అమెరికా. వైరస్ బారిన పడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికాలో కరోనా వైరస్ మున్ముందు ఘోరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికారులు సూచిస్తున్నారు.

వచ్చే శీతాకాలంలో అమెరికాలో ఘోరమైన పరిస్థితి ఉంటుందుని ఈ కాలంలో ఈ వైరస్ ఇంకా విజృంభించే ముప్పుందని దానికి ఫ్లూ కూడా తోడై పరిస్థితులు భయానకంగా మారొచ్చని అమెరికా అధికారులు చేసిన హెచ్చరికలతో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వాతావరణ మార్పుతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చిరిస్తున్నారు. చల్లటి ప్రదేశంలో వైరస్, ఫ్లూలు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది.

అమెరికాలో కొవిడ్ -19 బాధితుల సంఖ్య 8లక్షల 50వేల మంది ఉంది. యాభై వేల మందికి చేరువలో మరణాల సంఖ్య ఉంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. దీంతో 50వేల కోట్ల డాలర్ల ప్యాకేజీని సెనేట్ కు ఆమోదం తెలిపింది. ఆస్పత్రిలో మెరుగైన వసతుల కల్పనకు, కరోనా నిర్ధారణ పరీక్షలను పరీక్షలను వేగవంతం చేసేందుకు కూడా ఈ నిధులు ఉపయోగించనున్నారు.

మొత్తానికి అగ్రరాజ్యం అమెరికాలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంత ఇంత కాదు అదే సమయంలో వచ్చే శీతకాలంలోనూ ఈ వైరస్ విజృంభించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. శీతాకాలంలో ఫ్లూ కూడా తోడైతే కరోనాను నియంత్రణ చేయడం సాధ్యం కాదని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News