డాలర్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దెబ్బ.. రూపీని మారకంగా మార్చేందుకు భారత్‌కు సహకారం..

డాలర్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దెబ్బ.. రూపీని మారకంగా మార్చేందుకు భారత్‌కు సహకారం..

Update: 2022-12-15 14:00 GMT

డాలర్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దెబ్బ.. రూపీని మారకంగా మార్చేందుకు భారత్‌కు సహకారం..

Rupee Value: అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ డామినేషన్‌కు గండి పడుతోంది. రష్యా చమురు.. అమెరికా కరెన్సీకి గాట్లు పెడుతోంది. ఇటీవల భారత్‌కు చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో మాస్కో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది. భారత్‌కు చమురు ఆఫర్‌ను ప్రకటించడమే కాదు ఎగుమతుల లోటును సరిచేసుకునేందుకు రష్యా అవకాశమిచ్చింది. డాలర్ల చెల్లింపులకు చెక్‌ పెట్టి రూపాయిని ఫారెన్‌ కరెన్సీగా మాస్కో అంగీకరించింది. దీంతో వేల కోట్ల రూపాయలు భారత్‌కు మిగలనున్నాయి. అక్కడితో ఆగకుండా రూపాయిని ఫారెన్‌ రిజర్వ్ కరెన్సీగా భారత్‌ మారుస్తోంది. పలు దేశాలతో రూపాయల్లో లావాదేవీలు నిర్వహించేందుకు దూకుడు పెంచుతోంది. భారత్‌ అగ్రదేశంగా ఎదిగేందుకు రూపాయి మరింత ఊతమివ్వనున్నది.

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు సరఫరా చేసే దేశం రష్యా అమెరికా, సౌదీ అరేబియా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్‌కు అత్యధికంగా చమురును మాస్కోనే సరఫరా చేస్తోంది. భారత్‌కు ఎగుమతి చేసే చమురుపై భారీ డిస్కౌంట్‌ను క్రెమ్లిన్‌ ప్రకటించింది. బ్యారెల్‌ చమురుపై 30 డాలర్ల మేర మాస్కో తగ్గించింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురుకు భారత్‌కు 35వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్టు తెలుస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురుకు ఏడు నెలల్లో 2వేల కోట్ల డాలర్లను భారత్‌ చెల్లించింది. గత పదేళ్లలో రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురుకు చెల్లించిన నిధుల కంటే గత ఏడు నెలల్లోనే రెట్టింపయ్యింది. 2021లో భారత్‌ కొనుగోలు చేసిన చమురులో రష్యా నుంచి దిగుమతి అయ్యింది కేవలం 0.2 శాతం మాత్రమే. ఉక్రెయిన్‌ యుద్ధం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రష్యా ఎగుమతి చేస్తున్న చమురులో సగానికి పైగా భారతే కొనుగోలు చేస్తోంది. భారత్ కొనుగోలు చేసిన మొత్తం చమురులో 16 శాతం రష్యా క్రూడాయిలే కావడం విశేషం. రష్యాకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలు నిర్ణయించిన చమురు ధరల పరిమితిని, జీ7 దేశాలు నినదించినా విధానాన్ని భారత్‌ పక్కన పెట్టింది. నిజానికి అవి రష్యాతో భారత్‌తో చమురు కొనుగోళ్లకు ఏ మాత్రం సంబంధం లేనివి. రష్యాకు బలమైన, నమ్మకమైన చమురు మార్కెట్‌ భారతే. ఆంక్షల నడుమ రష్యా ఖజానా కళకళలాడుతోందంటే దానికి కారణం భారత్‌ ఈ నేపథ్యంలో భారత్‌ మార్కెట్లను వదులుకునేందుకు రష్యా ఏమాత్రం సిద్ధంగా లేదు. అందుకే రష్యా డిస్కౌంట్‌ ఆఫర్‌ను కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌ వంటి దేశాలు డిస్కౌంట్‌ అడిగితే కాదు పొమ్మంటోంది.

రష్యాను ఇరుకున పెట్టేందుకు ఇటీవల ఐరోపా దేశాలు.. క్రెమ్లిన్ చమురు ధరను పరిమితం చేసింది. బ్యారెల్‌ చమురును 60 డాలర్లకే విక్రయించాలని నిర్ణయించాయి. అయితే దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఐరోపా దేశాలు నిర్ణయించిన ధర కంటే తక్కువకే భారత్‌కు రష్యా చమురును విక్రయిస్తోంది. నవంబరులో భారత్‌కు కేవలం బ్యారెల్‌ చమురును 49 డాలర్లకే రష్యా విక్రయించింది. ఇక ముందు కూడా భారత్‌ మార్కెట్లను రష్యా వదులుకునేందుకు సిద్ధంగా లేదని డిస్కౌంట్లను కూడా ఆపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. భారీ నౌకలు, బీమా ఇబ్బంది లేకుండా భారత్‌కు చెందిన చమురు శుద్ధి కంపెనీలు రష్యా నుంచి వస్తున్న చౌక క్రూడాయిల్‌ను కొనుగోలు చేసేందుకు ఎగుబడుతున్నారు. ఐరోపా నిర్ణయించిన చమురు ధరల పరిమితి అనేది కేవలం ట్యాంకర్‌ నౌకలతో సరఫరా చేసే క్రూడాయిల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ట్యాంకర్‌ నౌకలతో చమురును కొనుగోలు చేసి ధర పరిమితి పాటించకపోతే జీ7 దేశాలకు చెందిన బీమా కంపెనీలు మూడు నెలల పాటు సేవలను నిలిపేస్తాయి. దీంతో తెలివిగా భారత్‌, చైనా దేశాలు ట్యాంకర్‌ షిప్‌ల నుంచి కొనుగోలు చేయడం లేదు. రష్యాకు చెందిన అత్యంత ముఖ్యమైన ఆయిల్‌ గ్రేడ్‌ యూరల్స్‌ ప్రస్తుతం ఐరోపా దేశాలు విధించిన ధర పరిమితి కంటే దిగువకు పడిపోయింది. దీంతో రష్యా భారత్‌కు భారీగానే డిస్కౌంట్‌కు చుమురును విక్రయిస్తోంది. రష్యా ఇస్తున్న డిస్కౌంట్లు మార్కెట్‌ రేట్‌ను బట్టే ఉంటుంది. అంతే తప్ప ఐరోపా సమాఖ్య విధించిన ధర పరిమితిని బట్టి చమురుపై ఆఫర్లను ఇవ్వడం లేదు. బ్యారెల్‌ చమురునుకు 49 డాలర్లను మాత్రమే చెల్లిస్తున్న భారత్‌.. భారీ లాభాలను పొందుతోంది.

అయితే ఇక్కడే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అసలు గేమ్‌ స్టార్ట్‌ చేశారు. తనపై ఆంక్షలు విధించిన అమెరికాపై, పశ్చిమ దేశాలకు దిమ్మతిరిగే వ్యూహాన్ని రచించారు. డాలర్‌ లావాదేవీలను నిలిపేసి చంకలు గుద్దుకున్న పశ్చిమ దేశాలను భారత్‌తో కలిసి భారీ దెబ్బ కొట్టారు. తనపై ప్రయోగించిన డాలర్‌ బ్యాన్ అస్త్రాన్ని పుతిన్ తిప్పికొట్టారు. డాలర్‌కే జలక్‌ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. భారత్‌ కొనుగోలు చేసే చమురుకు రూపాయల్లో చెల్లింపులకు రష్యా అంగీకరించింది. అంటే డాలర్ డామినేషన్‌కు భారత్, రష్యా చెక్‌ పెట్టినట్టయ్యింది. రష్యా చర్యతో అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ఆధిపత్యానికి తెర పడనున్నది. అయితే భారత్‌ నుంచి తనకు కావాల్సిన వస్తువుల జాబితాను భారీగానే రష్యా ఇచ్చింది. కార్ల తయారీ నుంచి ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాలు, టెక్స్‌టైట్స్‌, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌ను భారీగా కొనుగోలు చేస్తోంది. 2021లో 325 కోట్ల డాలర్ల ఎగుమతులను చేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు కేవలం ఆరు నెలల్లోనే భారత్‌ మాత్రమే 129 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులను రష్యాకు చేరవేసింది. అంటే రష్యా ఎగుమతులు పడిపోయాయి. అంటే భారత్‌కు, రష్యాకు మధ్య వాణిజ్య లోటు పెరుగుతోంది. దీన్ని అధిగమించేందుకు ఇరు దేశాలు చర్చలు జరిపాయి. అందులో భాగంగా రూపాయల్లో చెల్లింపులకు రష్యా అంగీకరించింది. వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడమే కాదు డాలర్‌ డామినేషన్‌పైనా రూపాయి సవాల్‌ విసిరింది. అసలు అంతర్జాతీయంగా డాలర్‌ డామినేషన్‌ ఎందుకు ఉంది? డీడాలరైజేషన్‌ అంటే ఏమిటి? డాలర్‌కు ఎలాంటి నష్టం జరుగుతుంది? దీని ప్రభావం అమెరికాపై పడుతుందా?

డాలర్‌.. అమెరికా కరెన్సీ. డాలర్‌ అంటే.. పెట్రోలు అనేలా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు గుర్తించిన ప్రధాన కరెన్సీ డాలరే. ఏ దేశమైనా చమురును కొనుగోలు చేస్తే అందుకు డాలర్లలో చెల్లిస్తారు. ఆయా దేశాల ఆర్థిక సంస్థలు లేదా కేంద్ర బ్యాంకులు.. అమెరికా డాలర్‌ నిల్వలను భద్రపరుచుకుంటాయి. ఎగుమతులకు వచ్చిన డాలర్‌నే దిగుమతులకు కూడా ఆయా దేశాలు చెల్లిస్తాయి. దిగుమతులు ఎక్కువై.. ఎగుమతులు తగ్గితే డాలర్‌ నిల్వలు పడిపోతాయి. డాలర్లు లేకపోతే.. చమురు, ఇతర వస్తువుల దిగుమతులు నిలిచిపోతాయి. దీంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్టుగా చెబుతారు. శ్రీలంక, పాకిస్థాన్‌లో ఇదే పరిస్థితి నెలకొన్నది. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు మొత్తం డాలర్లపై ఆధారపడడంతో అమెరికా శక్తివంతంగా మారింది. అంతర్జాతీయంగా ఎలాంటి వివాదం తలెత్తినా.. డాలర్‌ పరుగులు పెడుతోంది. దీంతో పలు దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. డాలర్‌ను అమెరికా ఓ ఆయుధంలా వాడుకుంటోంది. దీంతో డాలర్‌తో తమకు ముప్పు పొంచి ఉందని టెన్షన్‌ పడుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా డాలర్‌ ట్రేడ్‌ను పశ్చిమ దేశాలు నిషేధించాయి. దీంతో రష్యాకు చెందిన లక్షల కోట్ల డాలర్ల నిల్వలు అమెరికాలో స్తంభించాయి. దీంతో ఆ డాలర్‌‌కే చెక్‌ పెట్టేందుకు భారత్‌, రష్యా సిద్ధమయ్యాయి. శ్రీలంక, మాల్దీవ్స్‌తో పాటు దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు రూపాయి మారకంపై ఆసక్తి చూపుతున్నాయి. అంతర్జాతీయ విపణిలోకి రూపీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయా దేశాలకు ఊరట కలగనున్నది. సరైన సమయంలోనే రూపీ మారకాన్ని భారత్‌ ప్రవేశపెట్టినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

రూపాయి అంతర్జాతీయ మారక ద్రవ్యంగా మారితే భారత్‌ మరింత బలపడనున్నది. ఎగమతులను భారీగా పెంచుకునేందుకు అవకాశం లభించనున్నది. ఫారెన్‌ రిజర్వ్‌ కరెన్సీగా రూపాయి మారితే.. అమెరికా కరెన్సీ డాలర్‌, చైనా కరెన్సీ యువాన్‌కు దెబ్బ పడుతుంది.  

Tags:    

Similar News