ఎల్‌ఏసీ వద్ద చైనా కవ్వింపులు.. ధీటైన జవాబివ్వడానికి సిద్ధమవుతున్న భారత్

* యుద్ధం వచ్చినా ఎదుర్కొనేలా సర్వసన్నద్ధం * ఏల్‌ఏసీ వద్ద 50 నుంచి 60వేల అదనపు దళాలు మోహరింపు

Update: 2021-10-20 02:45 GMT

చైనాకు ధీటైన జవాబివ్వడానికి సిద్ధమవుతున్న భారత్(ఫైల్ ఫోటో)

India - China Border: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో డ్రాగన్‌కు దీటుగా సమాధానిమిచ్చేందుకు భారత సైన్యం సిద్ధమైంది. సరిహద్దుల్లో చైనా ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు రెడీ అయ్యింది. ము‌ఖ్యంగా గల్వాన్ ఘటన తర్వాత గత ఏడాది కాలంలో చైనా సరిహద్దుల్లో భారత్ తన కార్యకలాపాలను ఉధృతం చేసింది. అధునాతన ఆయుధాలతో ఆర్మీ సన్నద్ధమైతోంది. మరోవైపు చైనా ఫోకస్ అకస్మాత్తుగా టిబెట్ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌పై మళ్లింది. ఇప్పుడు అక్కడ ఉద్రిక్తతలకు తెరలేపుతోంది డ్రాగన్ కంట్రీ..

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ను ఇబ్బందిపెట్టేలా చైనా మరిన్ని మోహరింపులు చేస్తోంది. దీంతో భారత్ కూడా దీటుగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. చైనాకు పోటీగా భారత్ కూడా మళ్లీ బలగాల మోహరింపులు పెంచుతోంది. అలాగే అత్యాధునిక ఆయుధ వ్యవస్ధలను దింపుతోంది. దీంతో మరోసారి భారత్-చైనా పోరు ముదురుతోంది. ఓవైపు తూర్పు లడఖ్‌లో భారత బలగాలను చికాకుపెడుతున్న చైనా.. అదే సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన ఈస్ట్రన్‌ సెక్టార్‌ పైనా ఫోకస్ పెంచుతోంది.

ఇదిలా ఉంటే చైనాను ఎదర్కొనేందుకు భారత్ కూడా సిద్ధమైంది. అధునాతన ఆయుధాలతో ఆర్మీ సన్నద్ధమైతోంది. ముఖ్యంగా లేటెస్ట్ ఫిన్నిష్ సాకో స్నైపర్ రైఫిల్స్, ఇజ్రాయెల్​నెగెవ్ లైట్ మెషిన్ గన్స్, ది అమెరికన్ సిగ్ సౌర్ అసోల్ట్ రైఫిల్స్, సమకాలీన డ్రోన్లు, K9 వజ్ర T గన్స్, M-777 అల్ట్రా-లైట్ హౌవిట్జర్స్ అందుబాటులో ఉంచుకుంది. ఆకాశం నుంచి జారవిడవడానికి అనువైన ఆధునిక వాహనం 'లైట్‌ స్ట్రైక్‌ వెహికిల్‌'ను సమకూర్చుకుంది. ఇందులో ట్యాంకు.. విధ్వంసక గైడెడ్‌ క్షిపణి, రెండు మీడియం మెషిన్‌గన్లు ఉంటాయి. ఆరుగురు సైనికులు ప్రయాణించవచ్చు. దీంతోపాటు చిన్నచిన్న బృందాలతో గగనతల గస్తీ నిర్వహించడానికి చీతా, సరిహద్దుల్లో పనిచేస్తున్న బలగాలకు ఆహారం, ఆయుధాల సరఫరాకు ధ్రువ్‌, అవసరమైతే దాడి చేయడానికి ఆయుధాలు బిగించి మెరుగుపరిచిన రుద్ర హెలికాప్టర్లను వినియోగిస్తోంది.

Tags:    

Similar News