Modi: ఆస్ట్రేలియాలో ప్రధానికి విశేష ఆదరణ.. ఆశ్చర్యపోయిన అల్బనీస్‌

Modi: ఆస్ట్రేలియాతో బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్తామన్న మోడీ

Update: 2023-05-24 02:36 GMT

Modi: ఆస్ట్రేలియాలో ప్రధానికి విశేష ఆదరణ.. ఆశ్చర్యపోయిన అల్బనీస్‌

Modi: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన ఒక బాస్‌ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ పొగడ్తల వర్షం కురిపించారు. మరోపక్క.. మోదీ భారత్‌ సాధిస్తోన్న విజయాలపై ప్రవాస భారతీయులకు వెల్లడించారు.

భారత ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా అనూహ్య స్పందన వస్తోందని, రాక్‌స్టార్ రిసెప్షన్ ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ అన్నారు. మోడీని డియర్‌ ఫ్రెండ్ అని సంబోధించిన ఆయన.. ప్రధానిని అమెరికన్ సింగర్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌ స్టీన్‌తో పోల్చారు. చివరిసారిగా తాను ఈ వేదికపై బ్రూస్‌ స్ప్రింగ్‌ స్టీన్‌ను చూశానని.. ఆయనకు కూడా ఇంత స్పందన రాలేదని చెప్పారు. మోడీ ఈజీ ది బాస్‌ అని.. ఆయనకు లభిస్తోన్న ఆదరణను చూసి అల్బనీస్‌ ఆశ్చర్యపోయారు. అలాగే బ్రిస్బేన్‌లో త్వరలో కొత్త భారత కాన్సులేట్ ప్రారంభమవుతుందని ప్రకటించారు.

ఇక ప్రపంచంలోనే అతిపెద్ద 'టాలెంట్‌ ఫ్యాక్టరీ' భారత్‌లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన సిడ్నీలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ప్రజలు విశాల హృదయులని.. భారతీయులను అక్కున చేర్చుకున్నారన్నారు. ఆస్ట్రేలియాతో బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు మోడీ చెప్పారు.

Tags:    

Similar News