అమెరికాకు నకిలీ బ్రాండ్ వస్తువులు తీసుకువెళితే... కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త!

అమెరికా సీపీబీ అధికారుల నివేదిక మేరకు 2023లో అధికారులు 2.3 కోట్ల నకిలీ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు.

Update: 2024-06-20 14:59 GMT

అమెరికాకు నకిలీ బ్రాండ్ వస్తువులు తీసుకువెళితే... కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త!

అమెరికాకు వెళ్లే ముందు మీ వెంట తీసుకెళ్లే వస్తువులు, దుస్తులు ఇతర సామాగ్రిని ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. మీరు కొన్న దుస్తులు, ఇతర వస్తులు అసలైన బ్రాండ్స్‌వేనా అన్నది చెక్ చేసుకోవాలి. రకరకాల బ్రాండ్స్ పేర్లను తగిలిస్తూ తయారు చేసే నకిలీ ఉత్పత్తులు మీ దగ్గర ఉంటే, వాటిని అమెరికా అధికారులు సీజ్ చేస్తారు. ఒక్కోసారి మీ మీద కేసు కూడా పెట్టవచ్చు.


అమెరికాకు వెళ్లే ముందు ఈ రూల్స్ తెలుసుకోవాలి

అడిడాస్, నైకీ, ప్యూమా, లివైస్... వంటి బ్రాండ్ ఉత్పత్తుల్లా కనిపించే నకిలీ వస్తువులను అడ్డుకొనేందుకు కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో అమెరికాకు వెళ్లిన విద్యార్థులు, ఇతర భారతీయుల నుండి బ్రాండ్స్ పేరు తగిలించుకున్న వచ్చిన నకిలీ ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు.

జార్ఖండ్ కు చెందిన ఓ టీచర్ అమెరికా టెక్సాస్ లోని తన కొడుకును చూసేందుకు అమెరికా బయలుదేరారు. తన వెంట కొడుకుకు అవసరమైన 8 షర్ట్ లు, నాలుగు ట్రౌజర్లు, సాక్సులు, బూట్లు తీసుకెళ్లారు. ఎయిర్ పోర్టులోనే కస్టమ్స్ అధికారులు వీటి గురించి ఆరా తీశారు. నకిలీ బ్రాండెడ్ దుస్తులు, వస్తువుల గురించి ప్రశ్నించారని, ఈ విషయమై క్రిమినల్ కేసులు కూడా పెడతామంటూ అధికారులు ఒక దశలో తనను బెదిరించారని చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఈ దుస్తులను చించి చెత్తబుట్టలో వేశానని ఆమె చెప్పారు. దానివల్ల తాను 30 వేలు కోల్పోయానని ఆమె వివరించారు.


కాలిఫోర్నియా విద్యార్ధి వస్తువులను పారేసిన కస్టమ్స్ అధికారులు

అమెరికా కాలిఫోర్నియాకు వెళ్లిన హైద్రాబాద్ విద్యార్ధికి చెందిన వస్తువులను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ బ్రాండెడ్ వస్తువులను తీసుకెళ్లడం నేరమని తనకు తెలియదని ఆ విద్యార్ధి ఎయిర్ పోర్టు అధికారులకు సమాధానమిచ్చారు. ఏం చేయాలి, ఏం చేయవద్దు, ఏం తీసుకెళ్లాలి.. ఏం తీసుకెళ్లవద్దనే విషయాలపై తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. తన వద్ద నుండి 10 షర్ట్ లు, ప్యాంట్లు, మూడు జతల బూట్లను ఎయిర్ పోర్టు అధికారులు చెత్తబుట్టలో వేశారని ఆ విద్యార్ధి ఆవేదన వ్యక్తం చేశారు.


 అమెరికాలో 2.3 కోట్ల నకిలీ బ్రాండెడ్ వస్తువుల సీజ్

అమెరికా సీపీబీ అధికారుల నివేదిక మేరకు 2023లో అధికారులు 2.3 కోట్ల నకిలీ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. నకిలీ బ్రాండ్స్ వస్తువుల తయారీ మేధా సంపత్తి హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. వారు సీజ్ చేసిన వస్తువుల విలువ 270 కోట్ల డాలర్లుంటుందని కస్టమ్స్ అధికారి ఒకరు చెప్పారు.

చదువు కోసం లేదా ఉద్యోగాలు చేసేందుకు భారత్ నుండి వందలాది మంది ప్రతి ఏటా అమెరికా వెళ్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసే వస్తువులను పోలిన నకిలీలను తయారు చేసే కంపెనీలకు చెక్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు.

Full View


Tags:    

Similar News